Niharika Reddy : ఎన్టీఆర్ ను కలవడానికి పట్టీలు అమ్మేశా.. చిరంజీవి ఇంట్లోకి రానివ్వలేదు.. నిహారిక రెడ్డి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా నిహారిక రెడ్డి( Niharika Reddy ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అయితే నిహారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నిహారిక రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇంటర్ లో ఉన్న సమయంలో నాన్న ఒక హాస్టల్ లో పెట్టారని నాన్న ఫీజు సరిగ్గా కట్టలేదని ఆమె అన్నారు.ఆ సమయంలో సాంబ సినిమా( Samba Movie ) రిలీజైందని నిహారిక పేర్కొన్నారు.

ఆ సమయంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇస్తామని ప్రకటన వచ్చిందని ఆ యాడ్ చూసి నేను ఎన్టీఆర్ కలిసి చదువుకు కావాల్సిన ఫీజు తెచ్చుకోవాలని అనుకున్నానని నిహారిక చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను నా పట్టీలు, కమ్మలు అమ్మేసి ఎన్టీఆర్ ను కలవడానికి హైదరాబాద్ కు వచ్చానని ఆమె తెలిపారు.

ఆటోలో ఎన్టీఆర్( NTR ) ఆఫీస్ కు వెళ్లగా సినిమా ఫ్లాపైందని వాళ్లు డిప్రెషన్ లో ఉన్నారని చెప్పారని నిహారిక రెడ్డి కామెంట్లు చేశారు.ఇండస్ట్రీ అంత మంచిది కాదని వాళ్లు చెప్పారని నిహారిక పేర్కొన్నారు.ఆ సమయంలో నా వయస్సు 15 సంవత్సరాలు అని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

ఆ తర్వాత చిరంజీవి( Chiranjeevi ) ఇంటికి వెళ్లగా వాచ్ మేన్ గేటు దాటి ఇంట్లోకి కూడా రానివ్వలేదని నిహారిక చెప్పుకొచ్చారు.ఆ తర్వాత చంద్రబాబు గారి దగ్గరకు వెళ్లి కలవాలని అనుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

నేను ఎన్టీఆర్ భవన్ కు వెళ్లానని ఆమె తెలిపారు.

ఎన్టీఆర్ భవన్( NTR Bhavan ) దగ్గరే ఏడు రోజులు ఉన్నానని నిహారిక రెడ్డి పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడు నా వాక్చాతుర్యం చూసి జెమిని టీవీ( Gemini TV )లో రెఫర్ చేశారని ఆమె తెలిపారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ లో జాయిన్ కాలేదని నిహారిక వెల్లడించారు.

నిహారిక రెడ్డి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు