నూతనంగా వివాహమైన వారు హోలీ రోజు.. ఈ తప్పులను అస్సలు చేయకూడదు..

ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు హోలిక దహన్‌ను చూడడం మంచిది కాదు.ఇలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అటువంటి పరిస్థితిలో కొత్తగా వివాహం అయినవారు హోలీ రోజున గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా జరుపుకునే పండుగ హోలీ పండుగ.

హోలీ ఆడడానికి ఒకరోజు ముందు హోలిక దహన్ నిర్వహిస్తారు.ఈసారి మార్చి 7 వ తేదీన హోలిక దాహన్ ఉంటుంది.

హోలిక దహన్ ను నూతనంగా వివాహమైన వారు చూడకూడదు అని పెద్దలు చెబుతారు.వారు ఆ రోజు ఇంకా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నూతన వధూవరులు హోలీ రోజున నల్లటి దుస్తులను ధరించడం మంచిది కాదు.ఎందుకంటే అది ఆశుభంగా భావిస్తారు.

నలుపు రంగు అనేది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని పెద్దవారు నమ్ముతారు.

ఎందుకంటే హోలాస్టక్ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఈ రంగును ధరించడం మానుకోవడమే మంచిది.అంతేకాకుండా పెళ్లి అయిన తర్వాత తొలిసారి హోలీ జరుపుకునే మహిళలు తెల్లని దుస్తులు ధరించకూడదు.

వాటికి బదులుగా కొత్త వధువు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే మత విశ్వాసాల ప్రకారం పెళ్లి తర్వాత మొదటి హోలీని కొత్త జంటలు తమ అత్తమామలా ఇంట్లో జరుపుకోకూడదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
నోటి చుట్టూ ముడ‌త‌ల‌కు కార‌ణాలు, నివార‌ణ మార్గాలు మీకోసం!

ఇది ఇంటి ఆనందం మరియు శాంతిని ప్రభావితం చేస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Advertisement

కొత్త వధూవరులు అత్తమామల ఇంట్లో హోలీ ఆడడం అశుభవంగా భావిస్తారు.ఇలా చేయడం ద్వారా మీ సంబంధం కూడా చెడిపోతుంది.అంతేకాకుండా మీకు మరియు మీ భాగస్వామికి ఏదైనా ఆశుభం జరగవచ్చు.

ఈ మధ్యకాలంలో పెళ్లి జరిగిన స్త్రీలు తమకు వివాహంలో కానుకగా లభించిన వస్తువులను ఎవరికి దానం చేయకూడదు.

తాజా వార్తలు