న్యూ ఇయర్‌ మహిమ... 2023 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్‌ పొందండిలా?

మరో 7 రోజుల్లో సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు రకరకాల ఆఫర్లు పెట్టి వినియోగదారులను ఊరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇపుడు 2023 రూపాయలకే ఫ్లైట్‌ టికెట్‌ అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అవును, విమాన ప్రయాణం అంటే ఖరీదుతో కూడుకొన్నది.కొంత మందికి మాత్రమే ఇది పరిమితమైన అంశం.

కానీ ఇలాంటి ఆఫర్లుతో కొన్ని విమానయాన సంస్థలు సామాన్యులని సైతం ఆకట్టుకుంటున్న సందర్భాలు అనేకం వున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ విమానాయ సంస్థ అయినటువంటి ఇండిగో ప్రయాణికులకు ఓ బంపరాఫర్‌ ప్రకటించింది.

న్యూ ఇయర్‌ కానుకగా తక్కువ ధరకే విమానయానం చేసే అవకాశాన్ని కల్పించింది.అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు ఉంటాయి అని వినియోగదారులు గమనించాలి.

Advertisement

కేవలం నిర్ణీత తేదీల్లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ఈ అవకాశం వుంది.రూ.2023కే విమాన టికెట్లు పొందే అవకాశం వారికి మాత్రేమే.ఆయా డేట్స్ లో మాత్రమే.

ఇంతకీ ఎప్పటినుండి ఇప్పటివరకు అంటే.డిసెంబర్‌ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రమే.ఈ డేట్స్ లో దేశీయంగా విమాన టికెట్ల ప్రారంభ ధర రూ.2023, అలాగే అంతర్జాతీయ విమానాల టికెట్‌ ధర కూడా కేవలం రూ.4999కే అందించడం విశేషం.ఈ 3 రోజుల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జనవరి 15, 2023 నుంచి ఏప్రిల్‌ 14, 2023 మధ్య తేదీల్లో ప్రయాణం చేయొచ్చన్నమాట.

దీంతో పాటు HSBC బ్యాంక్‌ కార్డులతో టికెట్ బుక్‌ చేసుకునే వారికి అదనంగా డిస్కౌంట్ కూడా లభించనుంది.కొత్త ఏడాది సందర్భంగా ఇండిగో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు