గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్( Godawari Electric Motors ) తాజాగా ఎబ్లు ఫియో పేరిట ఒక అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది.దీని ధరను రూ.
99,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.ఇది 2.52 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది.గంటకు 60 కి.మీ టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది.ఈ టాప్ స్పీడ్‌తో ఎబ్లు ఫియో వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే స్కూటర్ 110 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.ఇది 7.4-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేస్తుంది.ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌కు స్పీడ్, రేంజ్, బ్యాటరీ లెవెల్‌తో సహా అనేక రకాల సమాచారాన్ని డిస్‌ప్లే ఆఫర్ చేస్తుంది.
అలానే CBS టెక్నాలజీతో కూడిన డిస్క్ బ్రేక్‌లు, AHO LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్, 60V హోమ్ ఛార్జర్‌ను అందిస్తుంది.Eblu Feo కోసం ఆల్రెడీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ఆసక్తి ఉన్నవారు ఈ కొత్త బైక్ బుక్ చేసుకోవచ్చు.
ఎబ్లు ఫియో( Eblu Feo ) అనేది ఫ్యామిలీ రైడ్స్ కోసం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్.పెద్ద సీటు, ఫ్లోర్‌బోర్డ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌తో ఇది సౌకర్యవంతమైన, సురక్షితమైన రైడింగ్ అందిస్తుంది.CBS టెక్నాలజీతో అందించిన డిస్క్ బ్రేక్‌ల బ్రేకింగ్ సిస్టమ్ అద్భుతమైన స్టాపింగ్ పవర్‌ని అందిస్తుంది.
భద్రతను మెరుగుపరుస్తుంది.ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో అనేక ఇతర భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.AHO LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ లైట్లు తక్కువ-కాంతి పరిస్థితుల్లో అద్భుతమైన విజిబిలిటీ అందిస్తాయి.60V హోమ్ ఛార్జర్ ఇంట్లో Eblu Feoని ఛార్జ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
స్కూటర్ సింగిల్ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది.కంపెనీ దీనిని రాయ్‌పూర్ ఫెసిలిటీలో తయారు చేస్తారు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హీరా గ్రూప్‌లో భాగమైన గోదావరి ఇ-మొబిలిటీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్( E-Mobility electric scooter )ను తయారు చేసింది.ఈ స్కూటర్ ట్రాఫిక్ వైట్, టెలి గ్రే, వైన్ రెడ్, కయాన్ బ్లూ, జెట్ బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయ్యింది.
Eblu Feo అనేది స్టైలిష్, ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది ప్రయాణాలకు, ఫాస్ట్ రైడ్స్‌కు సరైనది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy