గత కొన్నాళ్లుగా టీ కాంగ్రెస్( Telangana congress ) లో అంతర్మథనం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే.
నేతల మద్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు, పదవుల ఆదిపత్యాలు ఇలా ఎన్నో సమస్యలు కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేశాయి.
ఫలితంగా రాష్ట్రంలో పార్టీ ఊహించని రీతిలో బలహీన పడుతూ వచ్చింది.మునుగోడు ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ పూర్తిగా డీలా పడడంతో తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందనే వాదన కూడా గట్టిగానే వినిపించింది.
దీంతో పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు హైకమాండ్ చేసిన ప్రయత్నాలు అన్నీ అన్నీ కావు.టీ కాంగ్రెస్ నేతలతో పాదయాత్రలు, బహిరంగ సభలు, పర్యటనలు.
ఇలా ఒక్కటేంటి ఎన్నో కార్యక్రమాలను వెంటవెంటనే నిరవహిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పేరు తరచూ వినిపించేలా హైకమాండ్ గట్టి ప్రయత్నలే చేసింది.అలాగే విభేదాలతో కొట్టు మిట్టాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మరియు సీనియర్స్ కు మద్య వారధిలా ఉంటూ వారి విభేదాలను రూపుమాపే ప్రయత్నం కూడా గట్టిగానే చేసింది.
ఫలితంగా ఇటీవల పార్టీ సీనియర్స్ మరియు రేవంత్ రెడ్డి కలిసి పర్యటనలు చేస్తూ సఖ్యతగా మెలుగుతూ వచ్చారు./br>
మరోవైపు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు చేస్తున్న పాదయాత్రలకు కూడా మంచి స్పందన వస్తోందనే ఆ పార్టీ వర్గం నుంచి వినిపిస్తున్న మాట.ఇలా పూర్తిగా డీలా పడిపోయిన పార్టీని తిరిగి పైకి లేపడంలో హైకమాండ్ చూపిన చొరవ మంచి ఫలితాలని ఇచ్చినట్లే కనిపిస్తోంది.
ఇక ఇటీవల ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆపార్టీ నేతల్లో నయా జోష్ నింపాయి.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే.హామీలను నెరవేర్చే పార్టీ కూడా కాంగ్రెసే.
ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే మీరే ప్రభుత్వాన్ని కూల్చేయండి అంటూ ప్రియాంక గాంధీ వినిపించిన గళం టీ కాంగ్రెస్ లో లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉండడంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తున్న జోష్ ఇదే టెంపో లో కొనసాగించాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో టీ కాంగ్రెస్ కు సంబంధించిన చర్చే అధికంగా జరుగుతోంది.మరి ప్రస్తుతం ఉన్న జోష్ ఎన్నికల వరకు ఉంటుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy