రేవంత్ క్యాబినెట్ లో కొత్తగా ఛాన్స్ వీరికే ? 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తన క్యాబినెట్ ను విస్తరించేందుకు నిర్ణయించుకున్నారు .

తన ప్రమాణ స్వీకారం రోజునే 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఇప్పటికే వారికి శాఖలు కేటాయించారు.  పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు రేవంత్ సిద్దమవుతున్నారు.

ఈ మేరకు కొత్త క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలి అనే విషయంపై రేవంత్ గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో మంత్రివర్గ విస్తరణ పైన రేవంత్ చర్చించబోతున్నారు.

కొంతమంది పేర్లను రేవంత్ అధిష్టానం పెద్దల ముందు పెట్టి వారి అనుమతితో క్యాబినెట్ ను విస్తరించాలని నిర్ణయించుకున్నారట.  దీంతో రేవంత్ ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది .ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకోసం కామారెడ్డి సీటు ను త్యాగం చేసిన సీనియర్ నేత షబ్బీర్ అలీ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారట .

Advertisement

షబ్బీర్ అలీ( Mohammed Shabbir Ali ) మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.మైనారిటీ కోటలో షబ్బీర్ అలీ కి అవకాశం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట.ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కావడంతో అందులో ఒకటి కేటాయించి ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇక ఇదే ఎన్నికల్లో ఓటమి చెందిన అంజన్ కుమార్ యాదవ్ ( Anjan Kumar Yada )పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది.ఈయనకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రం చేస్తారని ప్రచారం జరుగుతుంది.

షబ్బీర్ అలీ కి హోంశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది .

ఇక గడ్డం వినోద్,  వివేక్ లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని , ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకోవాలని రేవంత్ భావిస్తున్నారట. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది.ఇక మరికొంతమంది సీనియర్ నాయకులు నేరుగా అధిష్టానం వద్దే మంత్రి పదవుల విషయమై లాబింగ్ చేస్తూ ఉండడం,  వీరిలో ఎక్కువగా ఓటమి చెందినవారు ఉండడంతో రేవంత్ నిర్ణయించిన వారికే మంత్రి పదవులు దక్కుతాయా లేక అధిష్టానం దీంట్లో ఏమైనా మార్పు చేర్పులు చేస్తుందా  అనేది చూడాలి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు