నాని సినిమాకు విచిత్రమైన సమస్య.. నాగ్ పుట్టినరోజును ఎంచుకోవడమే శాపమైందా?

న్యాచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నాని( Nani ) కొత్త సినిమా సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఆగష్టు నెల 29వ తేదీన విడుదల కానుండటం గమనార్హం.

అయితే అరోజు నాగ్ పుట్టినరోజు( Nagarjuna Birthday ) కాగా నాగ్ పుట్టినరోజు సందర్భంగా మాస్ సినిమా( Mass Movie ) రీరిలీజ్ కానుంది.సెప్టెంబర్ నెల 2వ తేదీన పవన్ పుట్టినరోజు కాగా ఆరోజు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒక సినిమా రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కానుండటంతో నాని సినిమాకు మైన్స్ అవుతుందని చెప్పవచ్చు.నాగ్ పుట్టినరోజును ఎంచుకోవడమే నానికి శాపమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సరిపోదా శనివారం సినిమాకు థియేటర్ల పరంగా కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

Advertisement

విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం సరిపోదా శనివారం సినిమాకు ప్లస్ అవుతోంది.నాని రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.30 కోట్ల రూపాయల రేంజ్ లో నాని పారితోషికం అందుకుంటున్నారు.నాని క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటూ మిడిల్ రేంజ్ హీరోలలో నాని తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకుంటున్నారు.

నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం ప్రేక్షకులను మెప్పిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది.

నాని విభిన్నమైన జానర్ల సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. చేతిలో గొడుగు పట్టుకొని రైలు నడుపుతున్న లోకో పైలట్..
Advertisement

తాజా వార్తలు