మద్యంలో ఇది మాత్రం కలుపుకోని తాగవద్దు

మద్యం అలానే రా ఎవరు తాగేయరు కదా.

అలా తాగేవారు లేకపోలేదు కాని, ఎంత పెద్ద మందుబాబు అయినా, మద్యంలో సోడా లేదా మంచినీళ్ళు కలుపుకోని తాగడానికి ప్రయత్నిస్తాడు.

కాని కొంతమందికి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలనిపిస్తుంది.మద్యం ఎప్పుడూ కలుపుకునేదే ఎందుకు కొత్తవి కూడా కలుపుకోని తాగితే బాగుంటుంది కదా, రుచి కొత్తగా ఉంటుంది కదా అని అనుకుంటారు.

అందుకోసమే సోడా వదిలేసి, మంచినీళ్ళు వదిలేసి, ఎనర్జీ డ్రీంక్స్ కలుపుకోని తాగుతారు.ఇది మంచి అలవాటు కాదు అంటున్నారు పరిశోధకులు.

ఓరకంగా ఇది ప్రమాదకరమైన అలవాటు అని అంటున్నారు.మద్యంలో ఎప్పుడూ కూడా, ఎనర్జీ డ్రింక్ కలుపుకోని తాగకూడదు అంట.ఎందుకు అంటే ఎనర్జీ డ్రింక్స్ లో కెఫైన్ ఎక్కువ ఉంటుంది.ఆ రెండిటి రియాక్షన్ మనిషి శరీరానికి మంచిది కాదట.

Advertisement

మద్యంలో ఎనర్జీ డ్రింక్ కలుపుకోని తాగితే శరీరం అదుపు తప్పే అవకాశాలు పెరిగిపోతాయని తాజాగా కెనడాలోని యూనివర్సిటి ఆఫ్ విక్టోరొయా జరిపిన ఓ పరిశోధనలో తేలింది.కెఫైన్, ఆల్కహాల్ రియాక్షన్ వలన మనిషి శరీరం మరింత బ్యాలెన్స్ తప్పుతుందట.

అదుపులో లేని మనిషి, మరింత అదుపు తప్పి, చేయరాని పనులు చేయడం, తనని తాను గాయపరుచుకోవడం చేసుకోవచ్చని ఈ యూనివర్సిటి ప్రొఫెసర్స్ అంటున్నారు.దీనికి ఉదాహరణగా వారు చాలా ఆక్సిడెంట్స్ ని చూపించారు.

ఆ అక్సిడెంట్ల రిపోర్ట్స్ లో మద్యం, ఎనర్జీ డ్రింక్ మిశ్రమం ఎక్కువగా కనిపించటంతో వారు ఈ కంక్లూజన్ కి వచ్చారు.దీనిపై మాట్లాడిన యూనివర్శిటీ పరిశోధకుడు రోమర్, మద్యం తాగినప్పుడు తన స్థితిని సరిగా అర్థం చేసుకోలేని మనిషి, కెఫైన్ మాస్క్ వలన ఓవర్ ఎనర్జెటిక్ గా ప్రవర్తిస్తూ, మరింత హద్దు దాటుతాడని, అదుపు తప్పి, తనకి ప్రమాదం కొనితెచ్చుకోవడమే కాదు, ఇతరులకి ప్రమాదంగా మారతాడని చెప్పుకొచ్చారు.

అక్కినేని ఇంటికి చిన్న కోడలుగా రాబోతున్న జైనాబ్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు