బిగ్ బాస్ ప్రియను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణాలివే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ సీజన్ 5కు నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సీజన్ కూడా ప్రేక్షకులను పరవాలేదనే స్థాయిలో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

ఎవరైతే ఎలిమినేట్ అవుతారని అనుకుంటారో ఆ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండటం గమనార్హం.ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో ప్రియ, వీజే సన్నీ మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి.అయితే సన్నీ ఫ్యాన్స్ మాత్రం ప్రియను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

సన్నీ, ప్రియ మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుండటం గమనార్హం.సన్నీ ఓపికతోనే వ్యవహరిస్తున్నా ప్రియ మాత్రం అతనిని రెచ్చగొడుతున్నారు.

సన్నీని ప్రియ అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, విలువ లేని మాటలు మాట్లాడటం ప్రియకు సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రియ సన్నీపై ఉమెన్ కార్డును ప్రయోగించాలని భావిస్తున్నారని నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇతర కంటెస్టెంట్ల అభిమానుల నుంచి కుడా సన్నీకి సపోర్ట్ లభిస్తూ ఉండటం గమనార్హం.

Netizens Trolling Bigg Boss Contestant Priya Why Because Details, Bigg Boss Priy
Netizens Trolling Bigg Boss Contestant Priya Why Because Details, Bigg Boss Priy

ప్రియ నెగిటివిటీని అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.త్వరలో ప్రియకు ఎలిమినేషన్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 5లో రవి విన్నర్ గా నిలిచే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.

Netizens Trolling Bigg Boss Contestant Priya Why Because Details, Bigg Boss Priy

ఈ సీజన్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించడానికి ఆయా కంటెస్టెంట్ల అభిమానులు తెగ కష్టపడుతున్నారు.మరోవైపు శ్వేత ఎలిమినేషన్ గురించి కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఈ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారో చూడాల్సి ఉంది.

ప్రియ త్వరలోనే బిగ్ బాస్ హౌస్ ను వీడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

తాజా వార్తలు