ఎయిర్ పోర్ట్ సిబ్బందిని నెట్టేసిన చిరు.. మండిపడుతున్న నెటిజన్స్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కుటుంబ సభ్యులు గత కొద్దిరోజులుగా పారిస్ వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇలా పారిస్ వెకేషన్ వెళ్లినటువంటి వీరు అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా ఒలింపిక్స్ వేడుకలలో కూడా పాల్గొని సందడి చేశారు ఇలా వీరి పారిస్ టూర్ ( Paris tour )కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ వెకేషన్ లో భాగంగా చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్ దంపతులకు కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

Netizens Shocking Trolls On Chiranjeevi Air Port Issue , Chiranjeevi, Air Port,

ఈ క్రమంలోనే చిరంజీవి దంపతులు పారిస్ వెకేషన్ పోతే చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చారు.

ఇలా ఎయిర్ పోర్టులో చిరంజీవి కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తనతో సెల్ఫీ తీసుకోవడం కోసం ముందుకు వచ్చారు కానీ చిరంజీవి తనని పట్టించుకోలేదు.అలాగే ఆ వ్యక్తి మరోసారి ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేయగా చిరంజీవి అప్పుడే క్రాస్ చేయాల్సి రావడంతో పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తికి సెల్ఫీ ఇవ్వకపోవడం కాకుండా తనని నెట్టేశారు.

ఇక ఈ సంఘటనను మరొక వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ వీడియో ట్రోల్స్ కి గురవుతుంది.

Netizens Shocking Trolls On Chiranjeevi Air Port Issue , Chiranjeevi, Air Port,

గత కొద్ది రోజుల క్రితం నాగార్జున సెక్యూరిటీ ఎయిర్ పోర్ట్ సిబ్బందిని నెట్టేశారు ఆ విషయం నాగార్జున గమనించుకోలేదు అయినప్పటికీ తనని భారీ స్థాయిలో ట్రోల్ చేయడంతో నాగార్జున క్షమాపణలు చెప్పడమే కాకుండా తిరిగి ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఆ సిబ్బందిని కలిసి తనతో ఫోటోలు దిగారు కానీ ఇప్పుడు చిరంజీవి విషయంలో మాత్రం కొందరు సమర్థిస్తూ వస్తున్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కొంతమంది నెట్టిజెన్స్ నాగార్జున గారికి తెలియకపోయినా ఆ ఘటనలో తనని బాతిని చేశారు కానీ ఇప్పుడు స్వయంగా చిరంజీవి నెట్టేసిన సరదాగా తోసారు అంటూ కథలు రాస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.నాగార్జునకి ఒక న్యాయం చిరంజీవికి ఒక న్యాయమా అంటూ యాంటీ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement
Netizens Shocking Trolls On Chiranjeevi Air Port Issue , Chiranjeevi, Air Port,

మరి ఈ వీడియో పై చిరు రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు