సితార ఘట్టమనేని ( Sitara Ghattamaneni ) పరిచయం అవసరం లేని పేరు పట్టుమని 12 ఏళ్లు కూడా లేనటువంటి ఈ చిన్నారి సెలబ్రిటీల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నమ్రతల ( Namrata ) గారాల పట్టిగా ఉన్నటువంటి సితార చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ తన చేసే అల్లరి పనులను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈమెకు ఎంతోమంది అభిమానులు మారిపోయారు.
అయితే ప్రస్తుతం సితారకు కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ద్వారా సితార తనకు సంబంధించిన ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటారు ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది.
ఇలా సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఇంత చిన్న వయసులోనే ఓ నగల సమస్త ఈమెను ఏకంగా తమ నగలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించుకున్న సంగతి తెలిసిందే.ఇలా రోజురోజుకు సితారకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.
తాజాగా సితార షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు.తన తల్లి నమ్రతతో కలిసి సితార ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సితార పట్ల దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియో పై స్పందించినటువంటి కొందరు నేటిజన్స్ సితార అప్పుడే ఏదో హీరోయిన్ అయిపోయినంతగా బిల్డప్ ఇస్తుంది అంటూ ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది నేటిజన్స్ సితార కూడా బాలీవుడ్ స్టార్స్ డాటర్స్( Daughters of Bollywood Stars ) లాగా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ ఈమె పట్ల నెటిజన్స్ కామెంట్స్ చేయడం గమనార్హం ఇలా సితార ఈ వీడియో పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు.సితార హీరోయిన్ కావాలి అనుకుంటే ఎంత సేపు తన తండ్రి ఓ పెద్ద స్టార్ హీరో అనే విషయం అందరికీ తెలిసిందేగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించబోతున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy