Deepthi Sunaina : దీప్తి సునైన రిప్లై ఇస్తేనే మందు తాగడం ఆపుతానన్న నెటిజన్.. ఇలా తయారయ్యారేంట్రా బాబు?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలతో అభిమానులు నేరుగా మాట్లాడే అవకాశం కలిగింది.

అయితే ఇదే అదునుగా భావించి కొంతమంది అభిమానులు సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు.

తనతో మాట్లాడితేనే నేను పరీక్షలకు చదువుతానని కొందరు కామెంట్లు చేయడం మరికొందరు మా అభిమాన హీరో రిప్లై ఇస్తేనే నేను ఇండియాకి వస్తాను అంటూ మరికొందరు సెలబ్రిటీలను ఇటీవల కాలంలో బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీగా గుర్తింపు పొందిన వారిలో నటి దీప్తి సునయన( Deepthi Sunaina ) కూడా ఒకరు.

ఈమెకు కూడా భారీ స్థాయిలోనే అభిమానులు ఉన్నారు.అయితే తాజాగా ఓ అభిమాని ఏకంగా కింగ్ ఫిషర్ బ్రాండ్ కి సంబంధించినటువంటి మందుసీసాని( Wine Bottle ) చేతిలో పట్టుకొని కేబుల్ బ్రిడ్జ్ పై( Cable Bridge ) ప్రయాణం చేస్తూ ఆ బాటిల్ అందరికీ కనిపించేలా చూపెడుతూ ఈ రీల్ కి దీప్తి సునయన రియాక్ట్ అయితే నేను తాగడం మానేస్తాను అంటూ కామెంట్ చేశారు.

Netizens Comments On Deepthi Sunaina

ఈ విధంగా ఆ నేటిజన్ రీల్ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై దీప్తి సునయన స్పందించి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.ఇలా దీప్తి సునైన ఈ వీడియో పై స్పందిస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి ఏమోజీలను షేర్ చేశారు.

Advertisement
Netizens Comments On Deepthi Sunaina-Deepthi Sunaina : దీప్తి స�

దీంతో ఈ రీల్ వీడియో కాస్త వైరల్ గా మారింది.అయ్యయ్యో దీప్తి సునయన స్పందించింది ఇక మనోడు మందు తాగడం ఆపేస్తాడా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Netizens Comments On Deepthi Sunaina

ఏది ఏమైనా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రిటీలను( Celebrities ) ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ చేస్తున్నటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ వీడియో పై మరికొందరు నెటిజన్స్ స్పందిస్తూ ఏమి సైకోగాళ్ళు ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు వేరే బ్రాండ్ తీసుకో ఇద్దరం కలిసి తాగుదాం అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

ఇక దీప్తి సునయన యూట్యూబ్ తన కెరియర్ ప్రారంభించి ఎన్నో వీడియోలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలో అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక గతంలో షణ్ముఖ్ జశ్వంత్ తో( Shanmukh Jaswanth ) ప్రేమలో ఉన్నటువంటి ఈమె బిగ్ బాస్ తర్వాత తనతో బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం ఒంటరిగా కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు