కడుపుకి అన్నం తింటారా లేక అది తింటారా.. శ్రీలీలకు షాకిచ్చిన నెటిజన్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి అతి చిన్న వయసులో హీరోయిన్ గా అడుగుపెట్టి తన అందాలతో, నటనతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ శ్రీలీల.

తక్కువ సమయంలోనే స్టార్ హీరో సరసన నటించగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా, కుర్రాళ్ళ హృదయాలలో క్రష్ గా మారింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.

బాగా సందడి చేస్తుంది.శ్రీలీల తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టింది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అదే ఏడాది మరో అవకాశాన్ని కూడా అందుకుంది.ఆ తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్ళల్లో పడటంతో 2021 లో పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

Advertisement

ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించగా చాలావరకు ఈ సినిమాతో ఈమె లైఫ్ క్లోజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.ఎందుకంటే అతి చిన్న వయసులోనే స్టార్ హీరో సరసన నటించడంతో బ్యూటీకి అవకాశాలు వస్తాయా రావో అన్న ఆలోచనలు అందరిలో ఎదురయ్యాయి.కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీ లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.

అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.

జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.

Advertisement

ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ప్రస్తుతం కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఈ బ్యూటీనే ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.

ఇక అందులో షార్ట్ డ్రెస్ లో తన అందాలతో ఫిదా చేసింది.చూపులతో మరోసారి కుర్రాళ్లకు మత్తెక్కించింది.

  ఇక ఆ ఫోటోలను చూసిన తన ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

తన అందాన్ని మరింత పొగుడుతున్నారు.ఇక ఓ నెటిజన్ మాత్రం.మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేక అందం తింటున్నారా అంటూ షాకింగ్ కామెంట్ చేయగా ప్రస్తుతం కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది.మొత్తానికి ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ.

తాజా వార్తలు