శునకం ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. స్కిప్పింగ్‌తో ఏకంగా గిన్నిస్ రికార్డు

చాలా మంది తమ ట్యాలెంట్‌తో ప్రపంచ రికార్డులను నెలకొల్పుతుంటారు.గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టడం కోసం రిస్క్‌తో కూడిన పనులు కొందరు చేస్తుంటారు.

మరికొందరు తమ టాలెంట్‌తో గత రికార్డులను అధిగమిస్తారు.ఇలాంటి వారికి గిన్నిస్ రికార్డులలో చోటు దక్కుతుంది.

అయితే మనుషులతో పాటు జంతువులు కూడా గిన్నిస్ రికార్డులు సాధిస్తున్నాయి.తాజాగా ఓ శునకం స్కిప్పింగ్ ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీలో సోషల్ మీడియాలో కూడా ప్రచురించబడింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఆ వీడియోను పోస్ట్ చేశారు.

Advertisement
Netizens Are Jealous Of Sunakam's Talent Guinness Record Together With Skipping

కుక్క పేరు బాలు.దాని యజమాని పేరు వోల్ఫ్‌గ్యాంగ్ లాయెన్‌బర్గర్.

వీరిద్దరూ కలిసి 30 సెకన్లలో అత్యధిక స్కిప్‌లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.

Netizens Are Jealous Of Sunakams Talent Guinness Record Together With Skipping

బాలూ అనే కుక్క, దాని యజమాని వోల్ఫ్‌గ్యాంగ్ లాయెన్‌బర్గర్ 30 సెకన్లలో రెండు కాళ్ళపై 32 సార్లు తాడును దూకి ప్రపంచ రికార్డు సృష్టించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసిన వీడియోలో, బాలు తన యజమాని లాయెన్‌బెర్గర్‌తో కలిసి తన వెనుక కాళ్లపై స్కిప్పింగ్ చేసింది.రికార్డ్ బుక్ నోట్స్ ప్రకారం, కుక్క తన వెనుక కాళ్ళపై 30 సెకన్లలో 32 సార్లు స్కిప్పింగ్ చేసింది.

దీనిని 12 జూలై 2022న బాలూ, వోల్ఫ్‌గ్యాంగ్ లాన్‌బెర్గర్ సాధించారు.కుక్కతో పాటు లాయెన్‌బెర్గర్‌ ఇద్దరూ జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని స్టెకెన్‌బ్రాక్‌లో నివసిస్తున్నారు.కుక్క, దాని యజమాని ఇద్దరూ ఈ రికార్డును సంపాదించడానికి చాలా శిక్షణ పొందారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.దీనికి ఇప్పటికే 3 మిలియన్ల వ్యూస్ దక్కాయి.20,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.వీడియోను చూసిన నెటిజన్లు కుక్కను, దానికి శిక్షణ ఇచ్చిన దాని యజమానిని ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు