టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. చాలా డేంజ‌ర్ బాస్‌..!

టాయిలెట్‌లో( Toilet ) సెల్‌ఫోన్ వాడటం అనేది ఇటీవ‌ల రోజుల్లో చాలా మందికి ఒక అల‌వాటుగా మారిపోయింది.

వాస్త‌వానికి టాయిలెట్ లో రెండు మూడు నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

కానీ కొంద‌రు మొబైల్( Mobile ) మ‌త్తులో ప‌డి టాయిలెట్ లో గంట‌లు గంట‌లు గ‌డిపేస్తున్నారు.టాయిలెట్ లో ఫోన్ వాడ‌టం లేదా టాయిలెట్ లో ఎక్కువ స‌మ‌యం పాటు ఉండ‌టం చాలా డేంజ‌ర్‌.

దీని వల్ల కొన్ని శారీరక, మానసిక, ఆహార సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.టాయిలెట్ అనేది బాక్టీరియా( Bacteria ) ఎక్కువగా ఉండే ప్రదేశం.

సెల్‌ఫోన్‌ను టాయిలెట్‌లో ఉపయోగించేటప్పుడు అది ఆ బ్యాక్టీరియాను గ్రహించవచ్చు.త‌ర్వాత ఆ ఫోన్‌ను ముఖం దగ్గర పెట్టుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుంది.

Advertisement
Negative Effects Of Using Mobile In Toilet Details, Mobile, Toilet, Health, Hea

టాయిలెట్ కు వెళ్లొచ్చాక చేతులు శుభ్రం చేసుకున్నా, ఫోన్ మీద ఉన్న మైక్రోఆర్గానిజంలు మళ్లీ చేతుల మీదికి వస్తాయి.తర్వాత ఆ చేతులతోనే ఫుడ్ తింటే ర‌క‌ర‌కాల రోగాలు త‌లుపుతడ‌తాయి.

Negative Effects Of Using Mobile In Toilet Details, Mobile, Toilet, Health, Hea

అలాగే టాయిలెట్ పని 2 నిమిషాల్లో అయిపోవాల్సింది ఫోన్ వల్ల ప‌ది, ఇర‌వై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ అయిపోతుంది.ఇలా టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చొనడం వల్ల మలద్వారానికి ఒత్తిడి పడుతుంది.ఇది రక్తనాళాల వాపుకు, రక్తస్రావానికి దారితీస్తుంది.

మలవిసర్జన సమయంలో నొప్పి, అసౌకర్యం కలుగుతుంది.పైల్స్ సమస్య త‌లెత్తే రిస్క్ కూడా పెరుగుతుంది.

Negative Effects Of Using Mobile In Toilet Details, Mobile, Toilet, Health, Hea

ఫోన్ చూస్తూ టాయిలెట్ లో గంట‌లు త‌ర‌బ‌డి గ‌డిపేస్తే డే రొటీన్ డిస్ట్ర‌బ్ అవుతుంది.చేయాల్సిన ప‌నుల‌న్ని ఆల‌స్యం అవుతాయి.ఫోక‌స్ దెబ్బ తింటుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

మానసిక ఆందోళన, ఓవర్ స్టిమ్యూలేషన్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.టాయిలెట్ లో ఎక్కువసేపు ఒక స్థితిలో కూర్చోవడం వల్ల పాదాల్లో మంట లేదా నొప్పి రావచ్చు.

Advertisement

పైగా టాయిలెట్‌లోని తేమ వల్ల ఫోన్ పాడయ్యే అవకాశమూ ఉంది.మామూలు రెస్ట్‌రూమ్స్ లో కూడా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, ఇది ఫోన్‌లోని అంతర్గత భాగాలకు హాని చేయవచ్చు.

కాబ‌ట్టి, టాయిలెట్ లో ఫోన్ వాడే అల‌వాటు ఉంటే క‌చ్చితంగా దాన్ని వ‌దులుకోండి.ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

తాజా వార్తలు