రేపు ఎన్సీపీ కీలక సమావేశం ...: శరద్ పవార్

మహారాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రేపు ఎన్సీపీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత శరద్ పవార్ తెలిపారు.

అసలైన ఎన్సీపీ వారిదే అనుకుంటున్నారన్న ఆయన ఇలాంటి తిరుగుబాటులను చాలా చూశామని చెప్పారు.అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా వెనుక ఉన్న అసలైన నిజాలు కొద్ది రోజుల్లోనే బయటపడతాయని పేర్కొన్నారు.

అజిత్ పవార్ పై ఇప్పటివరకు ఉన్న కేసులను ప్రభుత్వం కొట్టివేస్తుందని చెప్పారు.రెండు, మూడు రోజుల్లో ప్రజలకు ఈ విషయం తెలుస్తుందని వెల్లడించారు.

అజిత్ తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లారని తెలిపారు.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable