అరెరే.. నయనతారను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడే?

నయనతార,విఘ్నేష్ శివన్ ల జంట గురించి మనందరికి తెలిసిందే.

దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పాటు ప్రేమలో మునిగి పోయిన ఈ జంట ఇటీవల మూడుముళ్ల బంధం తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

జంట పెళ్లి చెన్నైలో గ్రాండ్ గా జరిగిన విషయం అందరికీ విధితమే.ఇకపోతే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ మూడ్ లో ఉంది.

పెళ్లికి ముందు అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేసారు.ప్రస్తుతం ఈ జంట పెళ్లి తర్వాత రకరకాల ప్రాంతాలు తిరుగుతూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

అంతేకాకుండా అక్కడి ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ ను ఆస్వాదిస్తున్నారు. హనీమూన్ ట్రిప్ లో భాగంగా ప్రస్తుతం ఈ జంట థాయిలాండ్ లో ఉన్నారు.

Advertisement

థాయిలాండ్ లో విఘ్నేష్ నయన్ చాలా రొమాంటిక్ మూడ్ లో హాయిగా గడిపేస్తు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.ఎగ్జోటిక్ లొకేషన్ లో ఈ జంట సరాగాలు ఒక రేంజులో అభిమానుల్లోకి దూసుకెళుతున్నాయి.

విహారయాత్రలో జోడీ చాలా సంతోషంగా ఉన్నారు.నయన్ ఎల్లో టాప్ లో అద్భుతంగా కనిపిస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలను చూసిన కొందరు అభిమానులు.ప్రేమ ఎంత మధురం ప్రియురాలు డ్యాష్ డ్యాష్.

అంటూ సరదాగా క్లాసిక్ సాంగ్ ని గుర్తు చేసుకుంటున్నారు.భార్య నయన్ తో వెకేషన్ లో హబ్బీ విఘ్నేష్ నెవ్వర్ బిఫోర్ అనిపించే రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు.

దేవతామూర్తులకు ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదా?

నయన్ ని వీడి క్షణమైనా ఆయన ఉండలేరు! .ఇది నిజమే.ఇందుకు తాజా ప్రూఫ్ ఇదిగో అంటూ అభిమానులు నయన్- విఘ్నేష్ శివన్ జంట రొమాంటిక్ ఫోటోని షేర్ చేస్తున్నారు.

Advertisement