నయన్‌ విఘ్నేష్‌ హనీ మూన్‌ ప్లాన్స్ ఏంటో తెలుసా.!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్ గా ఎంత ఫేమస్ అయ్యిందో అంతకు మించి ఆమె ప్రేమ కథలతో ఫేమస్ అయ్యింది.

నయనతార ప్రేమ కథల గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.

నయన్‌ పెళ్లి చేసుకోబోతుంది.విఘ్నేష్‌ శివన్‌ తో నయనతార పెళ్లి జరగబోతుంది.

విఘ్నేష్ తో దాదాపు అయిదు సంవత్సరాలుగా నయనతార ప్రేమలో ఉంది.వీరిద్దరు సహ జీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

ఇంతగా ఫేమస్ అయిన నయనతార మరియు విఘ్నేష్ శివన్‌ లు మహా భలిపురంలో ఈనెల 9వ తారీకున పెళ్లి చేసుకోబోతున్నారు.పెళ్లి కి ముందే జోరుగా హాలీడేస్ ను ఎంజాయ్‌ చేసిన ఈ కపుల్‌ పెళ్లి అయిన వెంటనే హనీ మూన్‌ కు ఎక్కడకు వెళ్తారు అంటూ ఇప్పుడు తమిళ సోషల్‌ మీడియా జనాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

అక్కడి మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు మాల్దీవులకు వారం లేదా పది రోజుల పాటు పెళ్లి తర్వాత వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారట.ఆ తర్వాత వచ్చి షూటింగ్‌ ల్లో జాయిన్‌ అవుతారు.

కొన్ని నెలల తర్వాత మళ్లీ అమెరికా లేదా యూరప్ కు వెళ్లే ఆలోచనలో విఘ్నేష్‌ ఉన్నాడట.దర్శకుడు విఘ్నేష్ అన్ని విషయాలను చాలా పక్కాగా ప్లాన్‌ చేస్తాడు.

ఒక దర్శకుడు అవ్వడం వల్ల చాలా విషయాల్లో సీరియస్ గా ఉండి అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తాడు.విఘ్నేష్ అలా చేయడం వల్లే నయనతార కు అంతగా దగ్గర అయ్యాడు.

ఇప్పుడు ఆమె మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.ఒక సామాన్య దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ లేడీ సూపర్ స్టార్‌.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

కోట్లాది మంది హృదయాల్లో ఉన్న నయనతార ను పెళ్లి చేసుకోబోతున్నాడు.ఎంత అదృష్టవంతుడో కదా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు