తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అనంతరం హీరోగా అవకాశాలు అందుకొని ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) ఒకరు.
కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినటువంటి ఈయన సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మెప్పించారు అనంతరం జాతి రత్నాలు( Jathiratnaalu ) తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mister Polishetty) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులందరికీ కడుపుబ్బ నవ్వించారు.
ఈ విధంగా నవీన్ పోలిశెట్టి తన నటనతో వెండితెరపై ప్రేక్షకులందరికీ ఎంతగానో నవ్విస్తున్నారు.తెరపై నవ్వుతూ అందరిని నవ్వించే నవీన్ పోలిశెట్టి ఈ సక్సెస్ వెనుక ఎంతో కష్టం దాగి ఉందని తెలుస్తుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో కెరియర్ మొదట్లో ఈయన ఎదుర్కొన్న అవమానాలను కష్టాలను గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నవీన్ పోలి శెట్టి మాట్లాడుతూ సినిమాలపై ఉన్న ఆసక్తితో చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి ముంబై( Mumbai )కి వచ్చాను.ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆడిషన్స్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన తనకు ఒక అవకాశం కూడా రాలేదని ఈయన తెలియజేశారు.
ఇక ఆడిషన్స్ కి వెళ్లే సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను.ఇలా వెళ్లిన ప్రతిసారి కొందరు వ్యక్తుల పరిచయం అవుతూనే ఉన్నారు.అయితే వారు సినిమాలు రెస్టారెంట్లకు వెళ్దాం రమ్మని చెప్పేవారు.
వారితో వెళ్లాలి అంటే నా ఆర్థిక పరిస్థితి సరిపోయేది కాదు ఆ విషయం వారికి చెప్పలేను అలాంటి సమయంలో వెళ్లకుండా ఉండడానికి ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకున్నానని తెలిపారు.ఇక ఆడిషన్స్( Auditions ) కి వెళితే నా నటన చూడకుండానే చాలామంది రిజెక్ట్ చేశారు.
ఇక మరి కొంతమంది చూడటానికి నల్లగా ఉన్నావు కాస్త సర్జరీలు చేయించుకోవచ్చు కదా బాడీ ఫిట్నెస్ మైంటైన్( Body Fitness ) చేయొచ్చు కదా అంటూ ఆ మాటలతోనే నన్ను రిజెక్ట్ చేసేవారని తెలిపారు.ఇలా చేతిలో డబ్బులు లేక సినిమా అవకాశాలు రాక రెండు సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఆ సమయంలో ఒంటరిగా కూర్చుని ఎంతో ఏడ్చాను అంటూ ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy