ఆ యాంకర్ కారణంగానే నేను హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాను... నవీన్ చంద్ర కామెంట్స్ వైరల్!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా పనిచేయమయ్యారు నటుడు నవీన్ చంద్ర( Naveen Chandra ) .

ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించారు.

ఇక విలన్ పాత్రలలో కూడా నవీన్ చంద్ర నటించి మెప్పించారు.అయితే గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన చాలా రోజుల తర్వాత మంత్ ఆఫ్ మధు ( Month Of Madhu ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Naveen Chandra Interesting Comments About Anchor Udayabhanu , Naveen Chandra, Ud

ఈ సినిమాలో నవీన్ చంద్ర కలర్స్ స్వాతి ( Colours Swathi ) జంటగా నటించారు.వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు త్రిపుర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నవీన్ చంద్ర వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.

Naveen Chandra Interesting Comments About Anchor Udayabhanu , Naveen Chandra, Ud
Advertisement
Naveen Chandra Interesting Comments About Anchor Udayabhanu , Naveen Chandra, Ud

ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి హీరోగా రావడానికి కారణం ఒక యాంకర్ అని తెలియజేశారు.ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఉదయభాను ( Udaya Bhanu ) గారు కారణంగానే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.అసలు ఉదయభానుకు తనకు ఎలాంటి రిలేషన్ లేదని ఆయనప్పటికీ ఆమెను నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈయన తెలియజేశారు.

తాను హీరో కాకముందు ఒక డాన్స్ షో నిమిత్తం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చానని తెలిపారు.ఆ సమయంలో ఉదయభాను గారితో కలిసి మాట్లాడనని అప్పటినుంచి తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలిపారు.

అయితే తనతో కాంటాక్ట్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తనని ఫాలో అవుతున్నానని నవీన్ చంద్ర తెలిపారు.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు