దిల్ రాజు రాస్తానన్న రేవు సినిమా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ హరినాథ్ పులి దర్శకత్వం వహించిన తాజా సినిమా రేవు.

( Revu Movie ) ఈ సినిమాను మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లీ నిర్మించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి తాజాగా విడుదలైన ఈ రేవు సినిమా ఎలా ఉంది అసలు ఈ సినిమా కథ ఏమిటి? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్న వివరాల్లోకి వెళితే.

కథ.

పాలరేవు అనే గ్రామంలోని నివసించే అంకాలు (వంశీ పెండ్యాల)( Vamshi Pendyala ) గంగయ్య (అజయ్)( Ajay ) అనే ఇద్దరు యువకుల మధ్య ఎవరు బాగా ఎక్కువ చేపలు పడతారు అన్న విషయంపై పోటీ ఏర్పడుతుంది.ఆ పోటీ కాస్త ఇద్దరి మధ్య గొడవలు మనస్పర్ధలకు దారితీస్తుంది.

అలా గొడవలు జరుగుతున్న సమయంలో వీరిద్దరి జీవితాలలోకి ధనవంతుడైన నాగేసు (ఏపూరి హరీ) రాకతో వీరి జీవితాలలో ఊహించని మలుపులు తిరుగుతాయి.ఇలా నాగేసు రాకతో అక్కడ నివసిస్తున్నటువంటి సామ్రాజ్యం (స్వాతి భీమిరెడ్డి)( Swathi Bheemireddy ) సాంబశివ (సుమేశ్ మాధవన్) భూషణ్ వంటి వారి జీవితాలలో ఈయన ప్రభావం పడటంతో వారి జీవితాలు మారిపోతాయి.

Advertisement
Naveen Ajay Swathi Bheemireddy Revu Movie Review And Rating Details, Revu Movie

అయితే మరి వీరి జీవితం పట్ల నాగేశ్వ ప్రభావం ఎలా ఉంది? వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అలాగే ఆ ఇద్దరు వ్యక్తులలో చివరికి ఎవరు గెలిచారు? లేక ఇద్దరు ఒకటయ్యారా అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Naveen Ajay Swathi Bheemireddy Revu Movie Review And Rating Details, Revu Movie

విశ్లేషణ.

గ్రామీణ నేపథ్యంలో ఇప్పటికే గతంలో చాలా సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అలాగే మత్స్యకారుల నేపథ్యంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి.

కానీ ఈ సినిమా తీర ప్రాంతాలలో ఒక జాలరీ జీవితం ఎలా ఉంటుందనే విషయాలను ఎంతో అద్భుతంగా చూపించారు.ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయిన సెకండ్ హాఫ్ లో సినిమా పరవాలేదు అనిపిస్తుంది.

ఇక ఇందులో మరికొంత కామెడీతో పాటు కథనం కూడా బలంగా ఉంటే బాగుండేది అన్న ఫీల్ కలుగుతుంది.మొత్తానికి ఒక అద్భుతమైన కథతో డైరెక్టర్ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Naveen Ajay Swathi Bheemireddy Revu Movie Review And Rating Details, Revu Movie
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

నటీనటుల పనితీరు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పాలి.ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

ఇక నవీన్( Naveen ) చాలా తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.జాలరి పాత్రలో నవీన్ ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు నవీన్ అజయ్ స్వాతి భీమిరెడ్డి ఇలా మిగిలిన తారాగణం మొత్తం వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

సాంకేతికత.

కాగా దర్శకుడు హరినాథ్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.ఈ సినిమాలోని మొదటి భాగంలో అంకాలు గంగయ్య పాత్రలతో సరదాగా సాగిపోయింది.

ఇక సెకండ్ హాఫ్ లో కథ మొత్తం మలుపు తిరుగుతుంది.అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ వచ్చాయి.

అలాగే ఇందులో విజువల్స్ కూడా బాగున్నాయి.ఎడిటింగ్ కూడా బాగుందని చెప్పాలి.

రేటింగ్: 3/5

తాజా వార్తలు