పదేళ్లలో నాకు నచ్చిన సినిమా అదే... హీరో నాని కామెంట్స్ వైరల్!

నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక త్వరలోనే నాని సరిపోదా శనివారం ( Saripoda Sanivaaram ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నటుడు ప్రియదర్శి ( Priyadarshi ) నభా నటేశ్ ( Nabha Natesh ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం డార్లింగ్( Darling ) .ఈ సినిమా జూలై 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.వచ్చే నెల సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా మీ ముందుగా రాబోతున్నాను.వచ్చే నెల నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి.

Advertisement

కానీ ప్రియదర్శిని వల్ల  ముందుగానే స్టార్ట్ అయ్యాయి.ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది.

డార్లింగ్ టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్‌గా ఉన్నాయి.ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా యాక్షన్  సినిమాలు వస్తున్నాయి.

కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం.గతేడాది లవ్ స్టొరీ, ఎమోషన్ కలిపి హాయ్ నాన్నతో వచ్చాను.

ఈ ఏడాది లవ్ స్టొరీ, కామెడీ కలిపి డార్లింగ్ వస్తోంది.ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి.కామెడీ ఎమోషన్ లవ్ యాక్షన్ అన్ని జోనర్ సినిమాలు రావాలని నాని తెలిపాడు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఇక ఈ పదేళ్ల కాలంలో నాకు నచ్చిన సినిమా బలగం సినిమా( Balagam Movie ) అని తెలిపారు.ఇక డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటున్నట్లు నాని వెల్లడించారు.

Advertisement

అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, చైతన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు