ఈ న్యాచురల్ సీరంను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవ్వడం పక్కా!

పల్చటి జుట్టు తో బాధపడుతున్నారా.? ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన జుట్టు ఒత్తుగా మారడం లేదా.

? హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు మందులు కూడా వాడుతున్నారా.? అక్కర్లేదు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరంను కనుక వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవ్వడం పక్కా.హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడానికి ఈ సీరం అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు నుంచి మూడు మందారం ఆకులు తుంచి వేసుకోవాలి.అలాగే మూడు రెబ్బ‌లు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో సీరం ను సపరేట్ చేసుకోవాలి.ఈ సీరం పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

Advertisement

ఆపై ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేయాలి.నైట్ నిద్రించే ముందు ఈ హోమ్ మేడ్ సీరంను అప్లై చేసుకుని.

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ సీరంను కనుక వాడితే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.అలాగే ఈ సీరం ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

సిల్కీగా, షైనీ గా సైతం మెరుస్తుంది.కాబట్టి తమ జుట్టు ట్రిపుల్ అవ్వాలనుకునేవారు తప్పకుండా ఈ న్యాచురల్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు