ముఖం అద్దంలా మెరిసిపోవాలా? అయితే ఈ సీర‌మ్ మీకోస‌మే!

ముఖం అద్దంలా త‌ళ‌త‌ళా మెరిసిపోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.

కానీ, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, కండి నిండా నిద్ర‌లేక‌పోవ‌డం, ఒత్తిడి, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, మేక‌ప్‌ను తొల‌గించ‌కుండా ప‌డుకోవడం, కాలుష్యం, ర‌సాయ‌నాలు అధికంగా ఉండే చ‌ర్మ ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల ఎప్పుడూ ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య వేధిస్తూనే ఉంటుంది.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ సీర‌మ్‌ను వాడితే ఎలాంటి స‌మ‌స్య‌లున్నా త‌గ్గిపోవ‌డ‌మే కాదు.ముఖం అద్దంలా కూడా మెరుస్తుంది.

మ‌రి ఆ సీర‌మ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక ఆరెంజ్‌, ఒక లెమ‌న్‌ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.

వాటికి ఉన్న తొక్క‌ల‌ను వేరు చేయాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేరు చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు తొక్క‌లు, నిమ్మ పండు తొక్క‌లు, ఐదారు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుండి స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల కుకుంబర్ జెల్‌, చిటికెడు ప‌సుపు, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తే సీర‌మ్ సిద్ధ‌మైన‌ట్లే.ఈ సీర‌మ్‌ను ఒక బాటిల్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే.రెండు వారాల పాటు వాడుకోవ‌చ్చు.

ఉద‌యం స్నానం చేయ‌డానికి గంట ముందు మ‌రియు నైట్ నిద్రించే ముందు ఈ సీర‌మ్‌ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మొటిమ‌లు, ముదురు రంగు మ‌చ్చ‌లు, ముడ‌త‌లు తొల‌గిపోయి ముఖం అద్దంలా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మెరిసిపోతుంది.

ఈ సీర‌మ్‌ను వాడ‌టం వ‌ల్ల డ్రై స్కిన్ స‌మ‌స్య నుండి సైతం విముక్తి ల‌భిస్తుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు