మహిళలపై దాడి: కెనడీయన్ నేషనలిస్ట్ పార్టీ నేత ట్రావిస్ పాట్రాన్‌పై కేసు

ఇద్దరు మహిళలపై దాడి చేసిన అభియోగంపై కెనడియన్ నేషనలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వేత్త ట్రావిస్ పాట్రాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సస్కట్చేవాన్‌ ప్రావిన్స్‌కు చెందిన 28 ఏళ్ల రెడ్‌వర్స్‌ను సంఘటన జరిగిన నవంబర్ 2 తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.

అదే సమయంలో పాట్రన్‌పై తీవ్రదాడి, శారీరక హాని కలిగించే దాడి వంటి అభియోగాలు మోపారు.దీనిపై స్పందించిన పాట్రాన్‌ ‘‘తమపై మోపబడిన అభియోగాలను ఖండిస్తున్నానని.

వీటిపై అవసరమైతే కోర్టులో వాటిని ఎదుర్కొంటానని ఆయన తేల్చిచెప్పారు.ఒక వ్యక్తి ఇద్దరు మహిళలపై దాడి చేస్తున్నాడంటూ నవంబర్ 2 తెల్లవారుజామున 2.27 గంటలకు విక్టోరియా అవెన్యూలోని 1900 బ్లాక్‌ నుంచి కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాల పాలైన ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఆ రోజు రాత్రి ఆ మహిళలు పాట్రాన్‌తో మాట్లాడారని.వారిని ఆయన తన ఇంట్లో ఉండాల్సిందిగా కోరగా ఆ మహిళలు నిరాకరించారు.

Advertisement

దీంతో పాట్రాన్‌ ఇద్దరు మహిళలపై దాడి చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ కేసులో పాట్రాన్ ‌నవంబర్ 25న కోర్టు ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

కాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇతని పార్టీ శ్వేతజాతి అహంకారాన్ని, వలస వ్యతిరేక, ఎల్జీబీటిక్యూ వ్యతిరేక విధానాలపై ద్వేషపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Advertisement

తాజా వార్తలు