రాత్రి 11.45 కి నింగిలోకి దూసుకెళ్లనున్న ఆర్టెమిస్-1

ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్ ఆర్టెమిస్ -1 ను నాసా ప్ర‌యోగించ‌నుంది.

చంద్రుని ఉప‌రిత‌లంపైకి చేరుకోవ‌డానికి వేదిక‌ను ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంతో ఆర్టెమిస్ అనే వ్యోమ నౌక‌ను నాసా చంద్రునిపైకి పంప‌నుంది.

ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంట‌ర్ లోని లాంచ్ ప్యాడ్ 39బి నుంచి ఈ వ్యోమ నౌక బ‌య‌లుదేరుతుంది.బార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 11.45 గంట‌ల‌కు నింగిలోకి దూసుకెళ్ల‌నుంది.ఆగ‌స్ట్ 29వ తేదీన జ‌ర‌గాల్సిన ఈ ప్ర‌యోగం ఇంధ‌న లీకేజీ కారణంగా చివరి నిమిషంలో ర‌ద్దు చేశారు.

ఈ సమస్యను సరిదిద్దిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి అంత సిద్ధం చేశారు.అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రయోగానికి అనుమతి ఇచ్చింది.వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఈ రాత్రికే ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.322 అడుగుల ఎత్తు ఉన్న ఈ రాకెట్ నాసా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైనది కావడం విశేషం.అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో ఎన్నో ఘనతలు సాధించిన నాసా.

భారత్ కు చెందిన ఇస్రో మాదిరిగా చంద్రుడిపైకి వెళ్లడంలో అంతగా విజయం సాధించలేకపోతోంది.ఈ నేపథ్యంలోనే త‌మ చ‌రిత్రలోనే అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1ను తీర్చిదిద్దింది.

Advertisement

సాంకేతిక సమస్యలను సరిదిద్ది రెండో ప్రయోగానికి రెడీ అయింది.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement