నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగించిన తర్వాత మన స్పేస్ సైన్స్ లో అనేక మార్పులు వచ్చాయి.
ఇటీవల మేధావి వర్గాల్లో ఆ మార్పుల గురించి పెద్ద చర్చే నడుస్తోంది.
ముఖ్యంగా ఇప్పటివరకూ ఓ నిర్దిష్టమైన అభిప్రాయాలుగా ఉన్నవన్నీ కూడా ఇపుడు మార్చుకోవాల్సిన పరిస్థితి.రీసెంట్ గా నాసా జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో నెప్ట్యూన్ అసలు రంగు బయటపడింది.
గత 30 ఏళ్లలో ఎప్పుడూ నెప్ట్యూన్ ని చూపించని విధంగా నాసా జేమ్స్ వెబ్ ఫోటోలు తీసింది.సూర్యుడికి చాలా దూరంగా ఉండే గ్రహం కావటంతో ఓ పెద్ద మంచుకొండ లాంటి ఈ గ్రహానికి ఏదో శనిగ్రహంలాగా రింగులుండటం లేటెస్ట్ గా కనబడుతోంది.
అలాగే దానికి తోడు కలర్ కూడా డిఫెరెంట్ గా వుంది.ఇప్పటివరకూ నెప్ట్యూన్ బ్లూ కలర్ లో ఉంటుంది అని ఓ నిర్ణయానికి వచ్చాము.
అయితే అది కొంత మేర కరెక్ట్ కాదని నాసా జేమ్స్ వెబ్ తాజాగా తేల్చి చెప్పింది.అలాగే దానిచుట్టు రింగులు ఉండటం మనం సదరు ఫొటోలో చూడవచ్చు.
దుమ్ము ధూళితో ఏర్పడిన వలయాలు అని వాటిని అనుకోవచ్చా అనే దిశగా ఆలోచిస్తున్నారు.జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ ఫ్రారెడ్ లైట్ తో చూస్తుంది కనుక అవి ఇంకా క్లియర్ గా కనిపించాయి.1846లో నెప్ట్యూన్ ని కనుగొన్నప్పటి నుంచి దానిపై అంతరిక్ష పరిశోధకులు పరిశీలిస్తూనే వున్నారు.
సూర్యుడి కి భూమి కి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే.సూర్యుడికి నెప్ట్యూన్ కి ఉన్న దూరం 30 రెట్లు ఎక్కువ.సో సూర్యుడి వల్ల ఏర్పడే మిట్టమధ్యాహ్నం కూడా నెప్ట్యూన్ పైన ఏదో మసక చీకటిలా ఉంటుంది.
బృహస్పతి, శని గ్రహాలతో పోలిస్తే నెప్యూన్ మీద చాలా రిచ్ ఎలిమెంట్స్, హైడ్రోజన్, హీలియం ఉన్నాయని పరిశోధకులు గతంలో అన్నారు.ఫలితంగా నెప్ట్యూన్ నీలిరంగులో కనిపిస్తున్నట్లు భావించారు.
అయితే ఇపుడు హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోల్లో నెప్ట్యూన్ తెలుపు రంగులో కనబడుతూ మీథేన్ గ్యాస్ వంటిది దానిమీద ఆవిరించి ఉండటం చూడవచ్చు.ప్రస్తుతం దీనికి గల కారణాలను మనవాళ్ళు విశ్లేషించే పనిలో పడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy