వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన నార్నె నితిన్.. ఈ యంగ్ హీరోకు తిరుగులేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్( Narne Nithin ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు నితిన్.

మొదట మ్యాడ్ సినిమాతో( Mad Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా మ్యాడ్ స్క్వేర్( Mad Square ) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

ఇందులో సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ లు నటించిన విషయం తెలిసిందే.కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా మార్చి 28 థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

అయితే విడుదల అయిన మొదటి షో నుంచే మంచి స్పందన లభిస్తోంది.

Narne Nithin Hat Trick Success With Mad Aay Mad Square Details, Narne Nithin, Ma
Advertisement
Narne Nithin Hat Trick Success With Mad Aay Mad Square Details, Narne Nithin, Ma

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.సీక్వెల్ కాబట్టి కచ్చితంగా కంపేరిజన్స్ ఉంటాయి.

కొంతమందికి మ్యాడ్ సినిమా నచ్చి ఉండవచ్చు.కాలేజ్ లో లవ్ లాంటివి నచ్చిన వాళ్లు ఉంటారు.

కానీ నేను చెప్తున్నా.మ్యాడ్ స్క్వేర్ మొదటి రోజు వసూళ్లు చాలా ఏరియాల్లో మ్యాడ్ క్లోజింగ్ ఫిగర్స్ గా వస్తాయి.

ఇది మాస్ సినిమా.దీనికి ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది అని అన్నారు.

సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?
హరీష్ శంకర్ ను పక్కన పెట్టేసిన రామ్ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?

ఉగాది ఫెస్టివల్ ముందు రోజు కనుక రేపు కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశం ఉందని, కానీ ఆది సోమవారాల్లో మాత్రం హ్యూజ్ నంబర్స్ చూడబోతున్నామని పేర్కొన్నారు.

Narne Nithin Hat Trick Success With Mad Aay Mad Square Details, Narne Nithin, Ma
Advertisement

ఈ సందర్భంగా నార్నే నితిన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టడానికి అభినందించారు.మీరు అబ్జర్వ్ చేశారో లేదో.మావాడి హ్యాట్రిక్ సినిమా ఇది.చాలామంది తక్కువ మంది హీరోలకే ఇలా కుదిరింది అని నాగవంశీ( Naga Vamshi ) అన్నారు.ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా నాగ వంశీ చేసిన వాఖ్యలను పరిశీలిస్తే నిజమనే చెప్పాలి.నార్నే నితిన్ మంచి ఊపు మీద ఉన్నారు.

మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి విజయాలతో హ్యాట్రిక్ ని అందుకున్నారు నితిన్.కాగా నార్నే నితిన్ మాత్రం చిన్న దర్శకులతో సింపుల్ స్టోరీను ఎంచుకుని సక్సెస్ సాధిస్తున్నాడు.

మాస్ హీరో అనిపించుకుందామనే ప్రయత్నాలు చేయకుండా సేఫ్ జోన్ లో వెళ్తున్నాడు.ఎలా అయితేనేం వరుసగా మూడు హిట్లు కొట్టడంతో యువ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కున్నట్లే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు