జీవితంలో ఆమె పెట్టిన ఇబ్బందులు మర్చిపోలేను... నరేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ (Naresh) ఒకరు.

ఒకప్పుడు హీరో సినిమాలలో హీరోగా నటించినటువంటి ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇక ఈయన కెరియర్ గురించి పక్కన పెట్టీ వ్యక్తిగత విషయానికి వస్తే తరచూ తన వ్యక్తిగత కారణాలవల్ల నరేష్ వార్తల్లో నిలుస్తున్నారు.నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఈయన మరొక నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh)తో రిలేషన్ లో ఉంటున్నారు.

వీరిద్దరి వ్యవహార శైలి చూస్తుంటే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని అనుమానాలు రాకుండా ఉండవు ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకొని జంటగా పలు కార్యక్రమాలకు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.దీంతో వీరి పెళ్లి గురించి తరచు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇకపోతే తాజాగా నరేష్ తన 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి కావడంతో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

ఇందులో ఈయన తన వృత్తిపరమైనటువంటి విషయాలను మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మధ్యకాలంలో రమ్య రఘుపతి(Ramya Raghupati) తో నరేష్ కు పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ వివాదాల ద్వారా వీరంతా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.అయితే రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితంలో సంతోషం అనేదే లేదని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.

నా జీవితంలోకి రమ్య వచ్చిన తర్వాత ఆమె పెట్టిన బాధలను నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఈయన వెల్లడించారు.ఇలాంటి బాధలలో ఉన్న నా జీవితంలోకి రమ్య రఘుపతి రావడం తన జీవితాన్ని మార్చేసిందని ఈయన తెలియజేశారు.

ఇకపోతే రమ్య రఘుపతి దగ్గర నా బిడ్డ ఉన్నారని, ఆమె వద్ద ఉండటం తనకు సేఫ్ కాదు అంటూ ఈ సందర్భంగా నరేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు