వివాదాస్పద సినిమా 'మళ్లీ పెళ్లి' ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

సీనియర్ నటుడు నరేష్( Naresh ) మరియు పవిత్ర లోకేష్( Pavitra lokesh ) కీలక పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా( Malli pelli movie ) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

నరేష్ మరియు పవిత్ర లోకేష్ ల యొక్క రియల్ ప్రేమ కథ ను కాస్త కల్పిత సంఘటనలతో కలిపి ఈ సినిమా లో చూపించడం జరిగింది.

నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి( Ramya Raghupati ) తో ఎదుర్కొన్న సంఘటనల సమాహారంగా మరియు పవిత్ర లోకేష్ తో ఎలా పరిచయం అయింది.ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా కలిసింది అనేది మళ్లీ పెళ్లి సినిమా లో చూపించడం జరిగింది.

విడుదలకు ముందు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఈ సినిమా కి అడ్డు పడిన విషయం తెలిసిందే.తనను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారంటూ సినిమా పై స్టే తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది.

కానీ నరేష్ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ప్లాన్ చేశాడు.నరేష్ ముందస్తు చూపు తో మళ్లీ పెళ్లి సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Naresh And Pavitra Lokesh Malli Pelli Movie Ott Details, Telugu Movie Latest New
Advertisement
Naresh And Pavitra Lokesh Malli Pelli Movie Ott Details, Telugu Movie Latest New

విడుదలకు ముందు వరకు సినిమా పై జనాల్లో ఆసక్తి కనిపించింది.అందుకే సాధ్యమైనంత ఎక్కువ థియేటర్ల లో విడుదల చేయడం జరిగింది.కానీ సినిమా కి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం తో కలెక్షన్స్ పెద్దగా రాలేదు.

దాంతో ఇప్పుడు సినిమా ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మరో వారం రోజుల్లో సినిమా ను ప్రముఖ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

విడుదలైన మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కి ఈ సినిమా ఇస్తే భారీ మొత్తం లో నిర్మాత నరేష్ కి లాభం దక్కే అవకాశం ఉంది.అందుకే మరి ఆలస్యం చేయకుండా మళ్లీ పెళ్లి సినిమా ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు