మార్చి 25న నారారోహిత్ ‘సావిత్రి’

నారా రోహిత్., యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.

నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం సావిత్రి.ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా.వి .బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సినిమా మార్చి 25న విడుదల అవుతుంది.ఈ సందర్భంగా.

చిత్ర నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ

‘’ ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది.ఇద్దరి పెయిర్ చాలా చక్కగా ఉంది.

Advertisement

ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం" అన్నారు.

దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ,

" ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తర్వాత నా డైరెక్షన్ లో వస్తున్న సినిమా .ఇప్పుడు నారా రోహిత్ తో సావిత్రి చిత్రాన్ని ఒక పూర్తి లవ్ అండ్ కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం.రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది.

నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది.సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి 25న విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

నటీనటులు :

  • నారా రోహిత్,
  • నందిత,
  • పోసాని కృష్ణ మురళి,
  • మురళి శర్మ, అజయ్,
  • రవి బాబు,
  • జీవా,
  • వెన్నెల కిషోర్,
  • శ్రీముఖి ,
  • ధన్య బాలకృష్ణన్,
  • మధు నందన్,
  • సత్యం రాజేష్,
  • ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు
  • సాంకేతిక విభాగం :

    సినిమాటోగ్రఫీ :

    - వస్సంత్ ,

    డైలాగ్స్ :

    - కృష్ణ చైతన్య,

    సంగీతం :

    - శ్రవణ్ ,

    ఎడిటర్:

    - గౌతం నెరుసు,

    ఆర్ట్ డైరెక్టర్:

    -హరి వర్మ,

    ఫైట్స్:

    - డ్రాగన్ ప్రకాష్,

    కో డైరెక్టర్:

    -సురేష్,

    ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ :

    - జాబిల్లి నాగేశ్వర రావు,

    నిర్మాత :

    - డా.వి .బి.రాజేంద్ర ప్రసాద్,

    కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం :

    - పవన్ సాదినేని.

    Advertisement

    తాజా వార్తలు