లోకేష్‌ ఎమ్మెల్సీ కాకుంటే మండలి రద్దు అయ్యేది కాదు

జగన్‌ ప్రభుత్వం మండలి రద్దు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.

ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానంను కేంద్ర హోం శాఖకు పంపడం జరిగింది.

తీవ్రమైన వివాదాస్పద నిర్ణయం తీసుకున్న జగన్‌ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాడు.తాము చేసిన బిల్లులను అడ్డుకుంటుంది అనే ఒక్క ఉద్దేశ్యంతోనే జగన్‌ మండలిని రద్దు చేస్తున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

Nara Lokesh Tdp Mlc Jagan Ysrcp Roja Mandali-లోకేష్‌ ఎమ్మ

తెలుగు దేశం పార్టీకి చెందిన సభ్యులు ఎక్కువగా ఉండటంతో పాటు లోకేష్‌ కూడా మండలి సభ్యుడిగా ఉన్నాడు.చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్‌ మండలి సభ్యుడిగా ఉండటం జగన్‌కు నచ్చలేదు అని, ఆయన్ను పదవి లేకుండా చేయాలనే పట్టుదలతోనే జగన్‌ మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో కక్ష సాధింపులు సహజంగా ఉంటాయి.కాని జగన్‌ మరీ ఈ స్థాయిలో కక్ష సాధించడం ఆశ్చర్యంగా ఉందని, లోకేష్‌ను మరెంతగా టార్గెట్‌ చేస్తాడో అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన లోకేష్‌ గతంలో మంత్రిగా కూడా చేశాడు.ఒకవేళ లోకేష్‌ ఎమ్మెల్సీ కాకుంటే ఖచ్చితంగా మండలి కొనసాగే అవకాశాలు ఉండేవని అంటున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ - 20
Advertisement

తాజా వార్తలు