బీజేపీ మార్క్ రాజకీయం :  లోకేష్ పవన్ లతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం 

ఏపీలో బిజెపి( BJP ) ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నా  ఆ పార్టీ జనసేన, టిడిపిలో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం వెనక చాలా రాజకీయ వ్యూహమే  దాగి ఉంది.

ఏపీలో బిజెపికి పెద్దగా ఆశలు లేవు.

ఇక్కడ గెలిచినా అరకొర సీట్లు మాత్రమే తమకు దక్కుతాయని బిజెపి పెద్దలకు ముందే తెలుసు.పొత్తులో భాగంగా కొన్ని స్థానాలనే తీసుకుని పోటీ చేయడం వెనుక కారణం ఇదే అన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉంది.

కాకపోతే టిడిపి , జనసేనలను( TDP Janasena ) ఉపయోగించుకుని మిగతా రాష్ట్రాల్లో బిజెపి ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఆ పార్టీ మొదలుపెట్టింది.ఈ మేరకు టిడిపి, జనసేన పార్టీలోని ముఖ్య నాయకులతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయించాలని నిర్ణయించుకుంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై( Tamilnadu BJP Chief Annamalai ) కోసం రెండు రోజులు కోయంబత్తూరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Advertisement

తాజాగా ఆయనకు తేజస్వీ సూర్య( Tejasvi Surya ) నుంచి కూడా ఆహ్వానం అందింది.బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య పోటీ చేస్తున్నారు.ఆయన బిజెపిలో యువనేతగా మంచి గుర్తింపును పొందారు.

తెలుగువారు ఎక్కువగా ఉన్న బెంగళూరు సౌత్( South Bangalore ) లో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,  అది తనకు కలిసి వస్తుందని తేజ సూర్య భావించి బిజెపి పెద్ద ద్వారా లోకేష్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ఆయనను ఒప్పించారు.త్వరలోనే లోకేష్ అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

  ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) తోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా బిజెపి ప్లాన్ చేసుకుంది.బెంగళూరు సిటీలో కాకుండా ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పవన్ తో ప్రచారం చేయించేందుకు బిజెపి సిద్ధం అవుతోంది.

కర్ణాటక( Karnataka )లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.రెండు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తవుతాయి.ఆ తరువాత నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అందుకే ముందుగా వారితో ప్రచారం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.కర్ణాటకలో బిజెపి ప్రచారానికి రెండు రోజులు సమయం కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

కర్ణాటక,  తమిళనాడులో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడ నేతలు కూడా ఏపీకి వచ్చి ప్రచారం చేసే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.తమిళ ఓటర్ల ప్రభావం ఉన్న నగరి వంటి చోట్ల అన్నమాలై తో ప్రచారం చేస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట.

తాజా వార్తలు