నాని ఆ సెంటిమెంట్‌కు బలవుతాడా?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘వి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నాని నెగెటివ్ పాత్రలో నటిస్తు్న్నాడు.

దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక మరో హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Nani V Movie To Face Negative Sentiment-నాని ఆ సెంటిమె�

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో వి చిత్రం రిలీజ్‌ను వాయిదా వేశారు.

అయితే లాక్‌డౌన్‌ ప్రకటించకు ముందే ఈ సినిమాను ఒకసారి వాయిదా వేశారు.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో ఖచ్చితంగా తెలియని పరిస్థితి.

Advertisement

అయితే ఈ సినిమాకు ఓ నెగెటివ్ సెంటిమెంట్ అడ్డుగా మారింది.ఇన్నిసార్లు వాయిదా పడ్డ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే వాదన ప్రస్తుతం వి చిత్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే ఈ కోవలోకి అర్జున్ సురవరం చిత్రం కూడా చాలాసార్లు వాయిదా పడుతూ రావడంతో ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయ్యింది.అయితే సినిమాలో దమ్ముండటంతో ఆ సినిమా విజయాన్ని అందుకుంది.

మరి నాని వి చిత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు