హిట్ 2 పై లేటెస్ట్ అప్డేట్.. అంతకు మించి ఉందంటున్న నాని!

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈయన సినిమాల్లో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.

ఇప్పటికే ఈయన తన సొంత బ్యానర్ స్టార్ట్ చేసి కొన్ని సినిమాలను నిర్మించాడు.ఇక ఈయన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.

విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.

ఈ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు హిట్ 2 తెరకెక్కించాడు.అయితే ఈసారి హీరోగా విలక్షణ హీరో అడవిశేష్ నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ నేపథ్యంలోనే నిన్న సోషల్ మీడియా వేదికగా అడవిశేష్ ఈ సినిమా రష్ చూశానని తన న్యూ అవతార్ సూపర్ గా ఉందని తెలిపాడు.

ఇక ఈ రోజు ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇచ్చాడు నిర్మాత నాని.

అడవిశేష్ చేసిన పోస్ట్ కు రీ ట్వీట్ చేస్తూ అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ మీ ముందుకు రాబోతుంది అని తెలిపాడు.అలాగే హిట్ 1 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా దానికి మించేలా ఉందని.శైలేష్ కొలను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ఈసారి కూడా ఆడియెన్స్ ను తప్పకుండ ఈ సినిమా అలరిస్తుంది అని తెలిపాడు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓడెలా దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మాస్ హీరోగా పక్కా డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్నాడు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈ సినిమాలో కీర్తి సురేష్ ఈయనకు జోడీగా నటిస్తుంది.

Advertisement