Nani : కొత్త డైరెక్టర్లతో ఎందుకు పని చేస్తున్నారనే ప్రశ్నకు అదిరిపోయే జవాబిచ్చిన నాని.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు.

మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )ఇందులో హీరోయిన్‍గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

ఈ పాటలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

Advertisement

ఇక తాజాగా నవంబర్ 4వ తేదీన అమ్మాడి అనే పాటను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ పాట లాంచ్ కోసం హైదరాబాద్‍లోని ఒక కాలేజీ లో ఈవెంట్ జరిగింది.ఈ సందర్భంగా హీరో నాని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని నానిని ఒక స్టూడెంట్ ప్రశ్నించారు.అన్నా.

నువ్వు అనుకుంటే పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేయవచ్చు.కానీ ఎందుకు కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని స్టూడెంట్ నానిని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు నాని బదిలిస్తూ.మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాకే వెళదామనే వెయిట్ చేయవచ్చు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

నా కోసమే ఎందుకు వస్తున్నారు థియేటర్‌కు.మన మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోతున్నాము.మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు.

Advertisement

నేనూ అంతే అని నాని తెలిపారు.దీంతో ఆ ప్రశ్న అడిగిన స్టూడెంట్ సూపర్ అన్నా అని బదులు ఇచ్చాడు.

కొత్త డైరెక్టర్లతో పని చేయడం తన మనసుకు నచ్చుతుందని నాని చెప్పారు.అనంతరం ఈ సినిమాలోని సమయమా అనే పాటకు స్టూడెంట్స్ తో కలిసి నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్టెప్పులు కూడా వేశారు.

కాగా నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి మరియు వీజేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు