నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మరో యాక్షన్ మూవీ...వర్కౌట్ అవుతుందా..?

సినిమా అనేది భారీ వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని.ఈ పనిని సక్సెస్ ఫుల్ గా చేయాలి అంటే దానికి దర్శకుడికి చాలా అనుభవం అయితే ఉండాలి.

సినిమాలు ఎలా తీయాలి అనేది తెలుసుకొని ఆ తర్వాత ఒక సినిమా స్టోరీని రాసుకొని ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం దర్శకుడి దగ్గర దమ్ము అయితే ఉండాలి.లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అవడం పక్క ఏ చిన్న మిస్టేక్ చేసిన కూడా ఇక్కడ ప్లాపులు అనేవి చాలా ఈజీగా వస్తుంటాయి.

కాబట్టి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.అనే దానిమీద దర్శకుడు మొదటి నుంచి కసరత్తులు చేస్తూ రావాలి.ఇక ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన దర్శకులు ఫెయిల్ అయిపోతుంటే కొంతమంది యంగ్ డైరెక్టర్లు మాత్రం వరుస సక్సెస్ లను అందుకుంటూ స్టార్ డైరెక్టర్లుగా ఎదుగుతున్నారు.

ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) లాంటి దర్శకుడు దసర సినిమాతో( Dasara Movie ) భారీ సక్సెస్ ని అందుకొని ఇక మరోసారి నానితో( Nani ) మరొక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికీ దసర తో భారీ సక్సెస్ అందుకున్న నాని తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

దసర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించినప్పటికి ఈ సినిమాతో కనక తను భారీ సక్సెస్ ని అందుకుంటే ఇక తనను మించిన దర్శకుడు మరొకరు ఉండరు అనేలా భారీ గుర్తింపుని అయితే సంపాదించుకోవచ్చు.తద్వారా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా అందుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు