భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి.. సామ్ విడాకులపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

చైతన్య సమంత విడిపోవటానికి కారణం ఏమిటో అభిమానులలో చాలామందికి క్లారిటీ లేదు.డైరెక్టర్ నందినీ రెడ్డి సమంత సన్నిహితురాలు అనే సంగతి తెలిసిందే.

కనీసం నందినీ రెడ్డికి అయినా చైసామ్ విడిపోవడానికి సంబంధించిన కారణం తెలుసని చాలామంది భావించారు.అయితే నందినీ రెడ్డి మాత్రం సమంత వ్యక్తిగత విషయాలలో తాను జోక్యం చేసుకోనని చెప్పుకొచ్చారు.

సమంత కెరీర్, నా కెరీర్ దాదాపుగా ఒకే సమయంలో మొదలైందని ఆమె కామెంట్లు చేశారు.జబర్దస్త్ మూవీ చేసే సమయంలో సమంతకు ఆరోగ్యం బాలేదని ఆ సమయంలో సమంత కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని నందినీ రెడ్డి కామెంట్లు చేశారు.

సమంత కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తాను అండగా నిలిచానని ఆమె కామెంట్లు చేశారు.ఆ సమయంలోనే మేము సన్నిహితులుగా మారిపోయామని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

తాను, సమంత సన్నిహితులు అయినా ఇద్దరి మధ్య మా లిమిట్స్ మాకు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.సెలబ్రిటీలకు సంబంధించి ఎంత తక్కువగా తెలిస్తే అంత మంచిదని ఆమె కామెంట్లు చేశారు.

పర్సనల్ విషయాలలో, కెరీర్ కు సంబంధించిన విషయాలలో హద్దులు దాటమని ఆమె తెలిపారు.ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా తాను ఆసక్తి చూపించనని ఆమె చెప్పుకొచ్చారు.

సెలబ్రిటీల జీవితాల గురించి ఎంత తక్కువగా అవగాహన ఉంటే అంత మంచిదని ఆమె వెల్లడించారు. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయని బయటివాళ్లు ఎన్నో అనుకుంటారని కానీ వాస్తవాలు వాళ్లిద్దరికే తెలుస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.నందినీ రెడ్డి చైసామ్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత తన సినిమాల ప్రమోషన్లలో భాగంగా చైతన్యతో విడాకులకు సంబంధించి ఏమైనా స్పందిస్తుందేమో చూడాల్సి ఉంది.చై, సామ్ ప్రస్తుతం వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement