టీఆర్ఎస్ లోకి నందమూరి సుహాసిని...???

ఇది బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలా.?? చంద్రబాబు కి షాకింగ్ న్యూస్ అనుకోవాలో.

?? రెండూ కాక ఊహాజనితమైన వార్త అనుకోవాలో అంతుబట్టడంలేదు.కాని మొత్తానికి ఇప్పుడు రాజకీయ వర్గాలలో మాత్రం సుహాసిని కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అనే వార్త మాత్రం హల్చల్ చేస్తోంది.

సుహాసిని ఏమిటి, టీఆర్ఎస్ లోకి చేరటం ఏమిటి.?? బాబు కి ఆమెకి అప్పుడే విభేదాలు వచ్చేశాయా అంటూ రకరకాల ఊహాగానాలకి తెరలు లేపుతున్నారు.అసలు సిసలు మ్యాటర్ లోకి వెళ్తే.

నందమూరి సుహాసినిగా ,హరికృష్ణ తనయ కూకట్ పల్లిలో నుంచీ తెలంగాణ ఎన్నికల్లో పోటీలో నిలిచిన విషయం విదితమే.అయితే తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ తో సుహాసిని టీఆర్ఎస్ లో చేరిక నిజమేనా అనిపించేలా చేస్తోంది.హరికృష్ణ కుమార్తెను మధ్యలో ఉంచి తెలంగాణలో బాబు రాజకీయాలు చేయాలని చూశారని తాజాగా కేసీఆర్ విమర్శించారు.

నాలుగు అడుగులు ముందుకు వేసి సుహాసినిపై జాలి కూడా చూపించారు.ఆమె ఓడిన తరువాత ఒక్క సారయినా సరే ఆమెకి ఫోన్ చేసి మాట్లాడావా అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

అయితే సుహాసిని ఓడిపోయిందనే కారణంగా, తన మిత్రుడు హరికృష్ణ కూతురు కూడా కావడంతో కేసీఆర్ ఆమెని పార్టీలోకి ఆహ్వానిచింది ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ పని చేయడంలో కూడా కేసీఆర్ కి రెండు లాభాలు వస్తాయి అదేనంటే.ఒకటి - సుహాసినికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తాము ఆంధ్రావాళ్లని కూడా కలుపుకుని పోతామని మరో సారి తెలుపడం, ఇక రెండోది - సుహాసిని ద్వారా ఆంధ్రా రాజకీయాల్లో బాబు ని ఎకేయడం.

ఇది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న వార్త అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కాని.ఇదే గనుకా నిజమైతే మాత్రం ఏపీ ఎన్నికల్లో బాబు కి ఘోరాతి ఘోరమైన దెబ్బ తగలడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు