నల్లారి రాజకీయం మళ్ళీ మొదలవ్వబోతుందా ?

మా బ్యాట్స్మెన్ చివరి బాలిక సిక్సర్ కొడతారు.ఈ మాట రాష్ట్ర విభజనకు ముందు చాలా ఫేమస్ అయ్యింది.

విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని చీఫ్ మినిస్టర్ మరియు మాజీ రంజీ ప్లేయర్ అయిన తమ అధినేత చివరి బాల్ కి సిక్సర్ కొట్టి విభజన ఆపేస్తారని అప్పటి కాంగ్రెస్ నేతలు లగడపాటి రాజగోపాల్ ఉండవెల్లి అరుణ్ కుమార్ వంటి వారు ఓ రేంజ్ లో హడావుడి చేసేవారు .ఆ మాటల్ని చాలామంది నమ్మరు కూడా .రాష్ట్ర విభజన ను అడ్డుకునే పెద్ద ప్లాన్ ఏదో వీళ్ళ దగ్గర ఉందని చాలా మంది నమ్మారు.అయితే పాపం చివర బంతికి శిక్ష కొట్టడం కుదరలేదు.

కేంద్ర స్థాయిలో బిజెపి కాంగ్రెస్ మద్దతు ఉండడంతో విభజన బిల్లు పాస్ అయింది.రాష్ట్రం విడిపోయింది కేవలం దానిపై కోర్టులో కేసు వేయటం మినహా వీళ్ళు చేసింది కూడా ఏం లేదు .ఆ తర్వాత కొత్త పార్టీ పెట్టి హడావిడి చేసినప్పటికీ విజయం దక్కలేదు.ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవడంతో నల్లారి కూడా తన ఉనికిని కోల్పోయారు .మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఈసారి ఆయన బిజెపిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా రికార్డులు కెక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా విపత్కర పరిస్థితుల్లో మంచి పరిపాలన అందించిన నేతగా పేరు తెచ్చుకున్నారు .భారీ నిరసనలు, విపక్షాల గొడవలు మధ్యన మంచి పరిపాలన అందించిన నేతగా పేరు తెచ్చుకున్నారు.విభజన ఆపడానికి ఆయన పూర్తిస్థాయిలో ప్రయత్నించారన్నది నిజం.

Advertisement

అది జరగకపోవడంతో ఒకరకమైన నిర్వేదానికి గురై ఇంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయారు.ఏది ఏమైనా నిజాయితీ గలిగిన రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు.

ఇంతకాలానికి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడం మంచిదైనప్పటికీ బిజెపిలో ఆయన ఎంతవరకు ఇమడగలరు అన్నది ప్రశ్నార్థకం ఎందుకంటే బిజెపిలో రాజకీయానికి అందరూ సూట్ కారు పైగా సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి మళ్లీ సాధారణ నాయకుడిగా ఎంతవరకు పనిచేయగలరు అన్నది కూడా జవాబు లేని ప్రశ్న.

Advertisement

తాజా వార్తలు