జర్మనీలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణ విద్యార్ధి దుర్మరణం, కేటీఆర్‌ సాయం కోరిన తల్లిదండ్రులు

విదేశాల్లో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడటంతో పాటు కన్నవారికి, పుట్టిన దేశానికి పేరు తీసుకురావాలని ఎంతో మంది యువత కలలుగంటున్న సంగతి తెలిసిందే.

కానీ అనుకోని ఆపదల కారణంగా మన విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.

రెండు రోజుల క్రితం కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.తాజాగా జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు.

జిల్లాలోని అచ్చంపేట మండలం అక్కారానికి చెందిన అమర్‌సింగ్‌ ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లాడు.ఈ క్రమంలో ఈ నెల 13న జరిగిన కారు ప్రమాదంలో అమర్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

దీనికి సంబంధించి అధికారులు బుధవారం రాత్రి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

స్థానిక ఎమ్మెల్యే బాలరాజు.అమర్‌సింగ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

మరోవైపు తమ బిడ్డ కడసారి చూపును తమకు దక్కించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను తల్లిదండ్రులు అభ్యర్ధించారు.కాగా.

కెనడాలోని ఒంటారియోలో జరిగిన ప్రమాదం విషయానికి వస్తే, శనివారం ఉదయం హైవే-401పై ప్యాసింజర్‌ వ్యాన్‌లో భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.ఆ సమయంలో ఓ ట్రాక్టర్‌.

వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించగా మరో ఇద్దరు గాయపడినట్లుగా కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పేర్కొన్నారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విద్యార్థుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణించిన విద్యార్ధులను హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహన్, పవన్ కుమార్‌గా గుర్తించారు.

Advertisement

వీరంతా గ్రేటర్ టొరంటో, మాంటోరియల్ ప్రాంతంలో చదువుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనలో గాయపడ్డా మరో ఇద్దరు విద్యార్ధులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.