ది ఘోస్ట్‌ నాగార్జున పారితోషికం దానిపై ఆదారపడి ఉందట!

నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ విడుదలకు సిద్ధమైంది.

దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా కి నాగార్జున ముందస్తు కేవలం అడ్వాన్స్ పారితోషికం మాత్రమే తీసుకున్నాడట.

పూర్తి రెమ్యూనరేషన్ ని నాగార్జున తీసుకోకుండా కొన్ని ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా దక్కించుకున్నాడట.అది కూడా నామినల్ రేట్లకే ఆ ఏరియాల యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నాగార్జున కు దక్కాయి.

సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో నాగార్జునకు ప్రస్తుతానికి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ దక్కింది.సినిమా సక్సెస్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ వసూలను సాధిస్తే అప్పుడు నాగార్జునకు 15 నుండి 20 కోట్ల రూపాయలు అదనంగా పారితోషికం దక్కుతుంది అంటూ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొత్తంగా పాతిక కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ నాగార్జునకు అందుతుందని అంటున్నారు.అది సినిమా సక్సెస్ అయితే మాత్రమే అనేది పాయింట్.

Advertisement

సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాల్లో నాగార్జున ఇంటర్పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పలు ఏరియాల్లో అన్నపూర్ణ బ్యానర్ ద్వారానే విడుదల కాబోతుంది.

ఎక్కడెక్కడ అయితే అన్నపూర్ణ బ్యానర్లో విడుదల కాబోతున్నాయో అక్కడి నుండి వచ్చే లాభాలు అన్నీ కూడా నాగార్జున తీసుకోబోతున్నాడట.

అదే ఆయన పారితోషకంగా సమాచారం అందుతుంది.సినిమా ఫలితాన్ని బట్టి నాగార్జున రెమ్యూనరేషన్ ఈ సినిమా కు ఎంత అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున గత చిత్రం బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కనుక ఈసారి కూడా నాగార్జున మరో బాక్సాఫీస్ విజయాన్ని సొంతం చేసుకుంటాడని అక్కినేని అభిమానులు ధీమాతో ఉన్నారు.మరి వారి నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు