ఆరోజుల్లో 'శ్రీ రామదాసు' చిత్రం ఎంత వసూళ్లు రాబట్టిందో తెలుసా..? చరిత్ర లో అదే తొలిసారి!

మన టాలీవుడ్ లో ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ).ఒక పక్క కమర్షియల్ మూవీస్, కుటుంబ కథా చిత్రాలు మరియు రొమాంటిక్ సినిమాలు చేస్తూ ఒక మంచి కమర్షియల్ స్టార్ హీరో గా పేరు తెచుకున్నప్పటికీ, మరో పక్క ప్రయోగాలు చేసి అత్యధిక విజయాలు అందుకున్న ఏకైక నిన్నటి తరం స్టార్ హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు ఆయన.

అప్పట్లో నాగార్జున కి రొమాంటిక్ హీరో గా వేరే లెవెల్ క్రేజ్ ఉండేది.అలాంటి హీరో నుండి అన్నమయ్య( Annamaya ) లాంటి భక్తి రస చిత్రాలను ఊహిస్తామా?, కానీ ఆయన ఆ సినిమా చెయ్యడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన చాలా కాలం తర్వాత రామదాసు (Sri Ramadasu ) చిత్రం తో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు( K Raghavendra Rao ) తెరకెక్కించిన ఈ భక్తి రస చిత్రం అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది.చాలా పల్లెల్లో ఈ సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోయి, థియేటర్స్ లో సీట్లు సరిపోక నిలబడి చూసిన సందర్భాలు ఉన్నాయి.అప్పుడంటే మన టాలీవుడ్ కి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేదు, అదే సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే వెయ్యి కోట్ల రూపాయిలు వసూలు చేసి ఉండేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

ఈ చిత్రం లో హీరో సుమన్ శ్రీరాముడిగా నటించగా, అర్చన సీత గా, నాగబాబు రావణాసురిడిగా, భక్త రామదాసు గా నాగార్జున మరియు కబీర్ దాస్ గా అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) నటించారు.ఈ చిత్రం లో నాగార్జున రామదాసు గా నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి.

ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన అద్భుతమైన నటన ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది.అప్పట్లో నాగార్జున మాస్ మరియు సూపర్ వంటి సినిమాలు చేసాడు, ఈ సినిమాల తర్వాత ఇంత భక్తిరస చిత్రం చేస్తాడని అభిమానులు కూడా ఊహించలేదు.

Advertisement

అయితే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆరోజుల్లో 8 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ ఖర్చు అయ్యిందట.కానీ ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించి నిర్మాతలకు 13 కోట్ల రూపాయిల లాభాలు( Sri Ramadasu Collections ) తెచ్చిపెట్టిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఈ సినిమా సాధించిన ఒక అరుదైన రికార్డు ని ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా అందుకోలేకపోయారు.

కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.అదేమిటంటే ఈ చిత్రాన్ని మొదటి సారి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసినప్పుడు 30 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్( TRP Ratings ) వచ్చాయట.

ఇప్పటి వరకు ఈ రికార్డుని బాహుబలి సిరీస్ సైతం బ్రేక్ చెయ్యలేకపోయింది.ఒక్క అల్లు అర్జున్ మాత్రం తన అలా వైకుంఠపురం లో చిత్రం తో 26 టీఆర్ఫీ రేటింగ్స్ దక్కించుకొని దగ్గరకి వచ్చింది, బ్రేక్ మాత్రం చెయ్యలేకపోయింది.

మరి ఈ సినిమా రేటింగ్స్ రికార్డ్స్ ని భవిష్యత్తులో ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?
Advertisement

తాజా వార్తలు