ఫ్యామిలీ కోసం సింహంలా పోరాడతాను.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ,నాగచైతన్య, సమంత( Konda Surekha, Naga Chaitanya, Samantha ) విడాకులను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో సంచలనంగా మారాయి.

ఇప్పటికే ఈ విషయంపై నాగార్జున అమల ఎన్టీఆర్ నాని కుష్బూ ఇంకా చాలా మంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.ఇక నాగార్జున ( Nagarjuna )అయితే చట్టపరమైన చర్యలకు కూడా దిగారు.

ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు.నిన్న కోర్టులో కేసు విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది.

నాంపల్లి కోర్టులో సోమవారం రోజు ఈ కేసు విచారణకు రానుంది.

Advertisement

కేటీఆర్( KTR ) కూడా లీగ‌ల్ నోటీసులిచ్చారు.తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నాగార్జున మ‌రోసారి సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు.ఈ మేరకు నాగార్జున స్పందిస్తూ.కొండా సురేఖపై మరో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసే పనిలో ఉన్నాము.ఆమె చేసిన వ్యాఖ్య‌లు మా కుటుంబాన్ని ఎంత‌గానో బాధించాయి.

ఇప్పుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.కానీ సురేఖ సమంతకు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

మాకు కుటుంబానికి కాదు.నాకు కాదు అని నాగ్ అన్నారు.

మ‌రి ఒక‌వేళ మీకు, మీ కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెబితే కేసు వాప‌స్ తీసుకుంటారా? అంటే? కుదరదు.నా కుటుంబానికి క్షమాపణ చెప్పినా కేసును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఆ అవకాశమే లేదు.

Advertisement

ఇది వ్యక్తిగత విషయం కాదు.నన్ను, నా కుటుంబాన్ని దాటిపోయింది.తెలుగు చిత్ర పరిశ్రమలోని చిన్నా పెద్దా అంతా మాకు మద్దతుగా నిలిచారు.

మన వ్యవస్థకు సోకిన తెగులును అరికట్టే ప్రక్రియలో మేము ఉన్నామని నేను భావిస్తున్నాను.మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను వాడుకోవడం సరికాదు.

మేం చిత్రపరిశ్రమకు చెందినంత మాత్రాన మాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మెతకగా ఉండబోము.ఈ విషయంలో మంత్రి సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాజకీయ నాయకులు మమ్మల్ని దూషించేందుకు ఒక గట్టి హెచ్చరిక అవుతుందని నేను ఆశిస్తున్నాను.

కుటుంబాన్ని కాపాడుకోవ‌డం కోసం సింహంలా పోరాటం చేస్తాను.చ‌ట్ట‌ప‌రంగా ఆల‌స్య‌మవుతుంద‌ని తెలుసు.

ఎంత కాల‌మైనా పోరాటం కొన‌సాగిస్తాను.వీలైనంత త్వ‌రంగా ప‌రిష్కారం దొరుకుతుంద‌ని ఆశిస్తున్నాను అని తెలిపారు నాగార్జున.

తాజా వార్తలు