లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) జీవితంపై నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్( Nayanthara: Beyond The Fairytale ) అనే డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి కీలక అంశాలతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.
అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా నవంబర్ 18 నయన్ 40 వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే గత రెండు మూడు రోజులుగా హీరో ధనుష్,( Dhanush ) నయనతార మధ్య విభేదాలు గురించి వార్తలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.తన మొదటి సినిమా నానుమ్ రౌడీ దాన్ ఫుటేజీని ఉపయోగించుకోనివ్వడం లేదని విమర్శిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ధనుష్ కి నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.ఇందులో ఆమె తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తో( Vighnesh Shivan ) కలిసి పనిచేసింది.
వివాదాల మధ్య ఓటీటీలో విడుదలైన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.ఈ డాక్యుమెంట్ లో నయనతార చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హీరోయిన్స్ చాలా మంది తమ ఎక్స్ రిలేషన్ షిప్స్ గురించి అంత వేగంగా ఓపెన్ కారు.అయితే నయనతార మాత్రం రెండు రిలేషన్స్ షిప్స్ గురించి డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.అలాగే వారితో బ్రేక్ అప్ కి కారణాల గురించి కూడా నయనతార వివరించింది.
ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున( Nagarjuna ) కూడా నయనతార గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.నయనతార కెరీర్ స్టార్టింగులో నాగార్జునతో కలిసి బాస్ మూవీ చేసిన విషయం తెలిసిందే.
తరువాత 2013లో గ్రీకువీరుడు సినిమా చేసింది.ఇదిలా ఉంటే బాస్ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల నాగార్జున మాట్లాడుతూ.
నయనతార తొలిసారి సెట్ లోకి వచ్చినపుడు ఆమె అందంతో పాటు నడకలో రాజసం కనిపించింది.
కొద్ది రోజులు ఆమెతో కలిసి పని చేసిన తర్వాత ఆమెతో స్నేహం చేయాలనిపించింది.నాతో మూవీ చేస్తోన్న సమయంలోనే ఆమె మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుసుకున్నాను.దాంతో నయనతార చాలా కంగారు పడుతూ ఉండేదని నాగార్జున తెలిపారు.
ఫోన్ రింగ్ అయితే ఆమెలో తెలియని ఆందోళన కనిపించేది, మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేది.నువ్వొక ఇండిపెండెంట్ అమ్మాయివి, వర్రీ అవుతూ ఇలాంటి రిలేషన్ లో ఎందుకు ఉన్నావని నయనతారని అడిగానని డాక్యుమెంటరీలో నాగార్జున తెలిపారు.
ఈ రిలేషన్ షిప్ గురించి నయనతార సైతం క్లారిటీ ఇచ్చింది.ఫస్ట్ టైం నా రిలేషన్ నమ్మకంతో ఏర్పడిందని అన్నారు.
అయితే అది కోల్పోయిన తర్వాత ఎక్కువ కాలం ఉండలేకపోయానని తెలిపారు.కానీ రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అయితే అబ్బాయిలని ఎవరూ నిందించరని, అమ్మాయిల వైపే వేలెత్తి చూపిస్తారంటు నయనతార తన మనసులోని మాటను బయట పెట్టింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy