మీడియా రంగంలోకి రాబోతున్న నాగబాబు.. ఇక జన సేనకు తిరుగుండదు?

మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతూనే మరోవైపు రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన ప్రస్తుతం జనసేన పార్టీ( Janasena Party ) ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తూ పార్టీ వ్యవహారాలను చక్క దిద్దుతూ వస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా ఎంతో మద్దతు ఇస్తున్నటువంటి ఈయన త్వరలోనే ఒక న్యూస్ ఛానల్ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Nagababu Enter Into The Media Field Details, Nagababu, Nmedia, Pawan Kalyan, Jan

తాజాగా N మీడియా( N Media ) అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నానని ప్రకటించారు.N మీడియా లోగో రివీల్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.తన పాత యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ ఎన్ మీడియా ద్వారా ఈయన ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్, భక్తి న్యూస్ మాత్రమే ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే భవిష్యత్తులో తన మీడియా ఛానల్లో మరింత అభివృద్ధి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Nagababu Enter Into The Media Field Details, Nagababu, Nmedia, Pawan Kalyan, Jan
Advertisement
Nagababu Enter Into The Media Field Details, Nagababu, NMedia, Pawan Kalyan, Jan

భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇప్పటినుంచి N మీడియాని స్థాపించి మళ్ళీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ ఈ ఛానల్ ద్వారా పొలిటికల్ న్యూస్ కూడా ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది.కేవలం యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్ తో ఆగుతారా శాటిలైట్ ఛానల్ కూడా పెడతారా, ఇలా ఈయన తన ఛానల్ అభివృద్ధి చేసుకుంటూ పోతే N మీడియా జనసేనకు బాగా కలిసి వచ్చే అంశం అంటూ చర్చలు జరుపుతున్నారు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు