తండేల్ సినిమాకు హైలెట్ సీన్లు ఇవేనా.. నాగచైతన్య కెరీర్ బెస్ట్ మూవీగా నిలవనుందా?

నాగచైతన్య( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటిస్తున్న చిత్రం తండేల్.( Thandel ) ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్డేట్లు విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత బన్నీ వాసు( Producer Bunny Vasu ) ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.ఈ సినిమా జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే కాదు.

Advertisement

శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జంట కథను తీసుకున్న అల్లిన కథ మాత్రమే కాదు అంతకుమించి ఉండబోతోంది.

అంతంత మాత్రం చదువుకున్న మత్స్యకారుల్లో నిగూఢంగా దాగిన దేశభక్తి కూడా దాగి ఉంటుంది.అలాగే ఆర్టికల్ 360 రద్దు తరువాత కరాచీలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలను ఈ సినిమాలో చూపిస్తారు.అయితే ఆ సంఘటనలు ఏమిటి అన్నది వెల్లడించలేను, సినిమాలో చూడాల్సిందే అని అన్నారు బన్నీ వాసు.

పాక్ జైలులో మగ్గే మత్స్యకార ఖైదీలు తాము రాసే ఉత్తరాల చివన్న జైహింద్ అని అస్సలు భయం లేకుండా ఇంగ్లీష్ లో రాసేవారని తెలిసి తాను, దర్శకుడు చందు మొండేటి( Director Chandoo Mondeti ) ఆశ్చర్యపోయామని అన్నారు.అదే సమయంలో మన ఖైదీలను ఏ విధంగా హింసించారో తెలిసిన తరువాత గుండె బాధతో బరువెక్కిందని అన్నారు.

ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకం అని హీరో చైతన్య ఈ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారని, గంటల తరబడి ఎండలో నిల్చుని స్కిన్ టోన్ మారడం కోసం ప్రయత్నించారని ఆయన తెలిపరు.

రామ్ చరణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాగార్జున...
మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?

సాయి పల్లవి కొన్ని సెకండ్ల పాటు ఆగకుండా చేసిన డ్యాన్స్ అలరిస్తుందని ఆయన అన్నారు.హీరో అక్కడ హీరోయిన్ ఇక్కడ అనే ఫీల్ లేకుండా ఇద్దరూ కలిసే వున్నారనే ఫీల్ వచ్చేలా సినిమా చిత్రీకరణ వుంటుందని అన్నారు బన్నీ వాసు.ఇంటర్వెల్ బ్యాంగ్ చిత్రీకరణకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

Advertisement

వాటిని అధిగమించి చిత్రీకరించాము.సినిమాలో శివతాండవం పాట కొన్నాళ్ల పాటు నిలిచిపోతుంది.

సినిమాలో సిజి వర్క్స్ వున్నా, వీలయినంత వరకు ఒరిజినల్ సీన్లు చిత్రీకరించడానికే ట్రయ్ చేసాము.మంగుళూరు దగ్గర సముద్రం మీద వీటిని రియలిస్టిక్ గా రియల్ గా చిత్రీకరించాము.

సినిమాకు తొంభై కోట్ల వరకు ఖర్చు చేసామని నాన్ థియేటర్ ఆదాయం యాభై కోట్ల వరకు వచ్చింది.మరో నలభై కోట్ల వరకు థియేటర్ నుంచి రాబట్టగలమన్న నమ్మకం వుందని బన్నీవాస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు