ఫ్లాప్‌ అయిన ప్రయోగాన్ని మళ్లీ చేస్తున్న చైతూ!

అక్కినేని హీరో నాగచైతన్య సక్సెస్‌ కోసం చేయని ప్రయత్నం లేదు.వరుసగా ఏదో ఒక ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు.

ఇప్పటి వరకు సోలోగా సాలిడ్‌ సక్సెస్‌ను నాగచైతన్య దక్కించుకోలేక పోయాడు.దాంతో కెరీర్‌పై ఆందోళన చెందుతున్న నాగార్జున మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం మజిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.ఈ చిత్రంలో తన భార్య సమంతతో కలిసి రొమాన్స్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న ఈ చిత్రంకు శివ నిర్వాన దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో ఒక రీమిక్స్‌ పాట ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

Advertisement
Naga Chaitanya Remix Song In Majuli-ఫ్లాప్‌ అయిన ప్�
Naga Chaitanya Remix Song In Majuli

నాగచైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’ ఆకట్టుకోలేక పోయిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన సవ్యసాచి చిత్రం నిరాశ పర్చింది ఏమాత్రం ఆకట్టుకోని ఆ చిత్రంలో నాగార్జున సూపర్‌ హిట్‌ పాట నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు.ను రీమిక్స్‌ చేయడం జరిగింది.

రీమిక్స్‌ పాటకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా సినిమాలో మాత్రం ఆ పాట పెద్దగా మెప్పించలేదు.దాంతో రీమిక్స్‌ వల్ల సవ్యసాచి చిత్రానికి పెద్దగా ఉపయోగం దక్కలేదు.

ఇక ప్రస్తుతం చేస్తున్న మజిలి చిత్రంలో రీమిక్స్‌ చేయడం చర్చనీయాంశం అవుతుంది.

Naga Chaitanya Remix Song In Majuli

‘మజిలి’ చిత్రంలో నాగార్జున ఒక సూపర్‌ హిట్‌ పాటను రీమిక్స్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.సమంత, నాగచైతన్యల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే ఇప్పటికే చేసిన ప్రయోగం విఫలం అవ్వడం, మళ్లీ ఆప్రయోగాన్ని చేయబోతుండటంతో ‘మజిలి’ చిత్రంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందాన్ని పెంచే అర‌టి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?

చైతూకు రీమిక్స్‌ కలిసి రావడం లేదని, మజిలిలో రీమిక్స్‌ లేకుంటేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు