ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్ ఇదే.. మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా నాగార్జున ఎన్ కన్వెన్షన్( Nagarjuna N Convention ) గురించె మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయం పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ విషయం గురించి నాగ చైతన్య( Naga Chaitanya ) స్పందించారు.

కాగా నాగ చైతన్య ఇటీవల నటి శోభిత ధూళిపాళ్ల( Sobhita Dhulipalla ) నిశ్చితార్దం కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా జ‌రిగిన విషయం తెలిసిందే.

అయితే పెళ్లి తేదీ గానీ, వేదిక గానీ ఎక్క‌డా అన్నది ప్ర‌క‌టించ‌లేదు.ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్ లో వివాహం రాజాస్తాన్ లో జ‌రుగుతుంద‌ని ఒక ప్ర‌చారం జోరుగా సాగుతోంది.వివాహం కూడా సింపుల్ గానే ఎలాంటి హ‌డావుడి లేకుండా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే తాజాగా ఈ వార్తలపై చైత‌న్య స్పందించారు.పెళ్లి వేదిక‌, ఇత‌ర వివ‌రాల‌న్నీ స్వ‌యంగా త‌నే త్వ‌ర‌లో చెబుతాన‌ని అన్నారు.

అలాగే వివాహం కేవ‌లం స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగినా అది గ్రాండ్ గా ఉంటుంద‌ని అన్నారు చై.దీంతో వెన్యూ ఇంకా క‌న్ప‌మ్ అయిన‌ట్లు లేద‌ని తెలుస్తోంది.మ‌రి అందుకు రాజ‌స్తాన్ వేదిక అవుతుందా? హైద‌రాబాద్ అడ్డ‌గా జ‌రుగుతుందా? ఈ రెండు గాక విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

అలాగే నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చి వేత‌పై ప్ర‌శ్నించ‌గా.ఈ ఘటనపై ఇప్పటికే నాన్న స్పందించారు అని తెలిపారు చైతన్య.దీనికి గురించి ప్ర‌త్యేకంగా తాను పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేద‌ని అన్నారు.

ఇకపోతే నాగచైతన్య విషయానికి వస్తే.ప్రస్తుతం చై చందు మొండేటి దర్శకత్వంలో తండేల్( Thandel ) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.కాగా ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ జరుగుతోంది.పాన్ ఇండియాలో లెవెల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

చైత‌న్య తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావ‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి.

తాజా వార్తలు