నాగ చైతన్య, చందు సినిమా టైటిల్ పై జనాలు ఏమనుకుంటున్నారు..!

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రానికి తాజాగా తండేల్‌( Thandel Movie ) అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది.

అంతే కాకుండా నాగ చైతన్య బర్త్‌ డే సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ ను కూడా విడుదల చేయడం జరిగింది.

మొత్తానికి తండేల్ సినిమా గురించి జనాల్లో చర్చ జరిగేలా చేశారు.సినిమా ను అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న కారణంగా కచ్చితంగా బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం టైటిల్ విషయం లో ఇంకో సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందేమో అంటున్నారు.

మొత్తానికి నలుగురు నాలుగు రకాలుగా సినిమా గురించి మాట్లాడేసుకుంటున్నారు.ప్రస్తుతం నాగ చైతన్య ఉన్న ఫామ్ ని దృష్టి లో పెట్టుకుని మీడియం బడ్జెట్‌ తో ఈ సినిమా ని రూపొదిస్తే బాగుంటుంది అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం నాగ చైతన్య( Naga Chaitanya ) కి ఈ సినిమా అయినా భారీ బడ్జెట్‌ అయితే మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో అంటున్నారు.ముందుగా ఈ సినిమా కు మరో టైటిల్ అనుకున్నారు.

కానీ కొందరు ఆ టైటిల్ ను బూతు అన్నట్లుగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేయడం తో మెగా ప్రొడ్యూసర్‌ తండేల్ టైటిల్‌ ను ఖరారు చేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.ఇక ఈ సినిమా లో హీరోయిన్‌ ఎవరు, ఇతర విషయాల గురించి త్వరలోనే బన్నీ వాసు( Bunny Vas ) ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేసి మరీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

ఇక ఈ సినిమా లో చైతూ ను జాలరీగా చూపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు